ఆర్ ఆర్ ఆర్ తో చరణ్ జూనియర్ లకు అనుకోని మార్పులు !
‘ఆర్ ఆర్ ఆర్’ ఫలితం అందరికీ తెలిసిపోవడంతో ఇక ఈసినిమాలో భీమ్ అల్లూరి పాత్రలలో నటించిన చరణ్ జూనియర్ లలో ఎవరు బాగా నటించారు అన్నవిషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి రాజమౌళి సినిమాలలో పాత్రలు కనిపిస్తాయి కానీ నటీనటులు కనిపించరు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విషయానికి వచ్చేసరికి పైకి చరణ్ జూనియర్ అభిమానులలో ఎవరు బాగా నటించారు అన్నచర్చలు మొదలయ్యాయి.
దీనికితోడు ఈమూవీ పై విశ్లేషణ చేసిన విమర్శకులు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ పై ప్రశంసలు కురించడం కొంచం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే బాలీవుడ్ మీడియా కూడ ఈమూవీ గురించి విశ్లేషణలు చేస్తూ రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తోంది. దీనితో బాలీవుడ్ చరణ్ కు సంబంధించిన గతాన్ని మర్చిపోయి ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తుందా అని అనిపించడం సహజం.
8సంవత్సరాల క్రితం బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘జెంజీర్’ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈసినిమా బాలీవుడ్ లో భయంకరమైన ఫ్లాప్ గా మారడమే కాకుండా ఈసినిమాలో నటించిన చరణ్ పై కూడ విపరీతమైన విమర్శలు వినిపించాయి. చరణ్ కు నటించడం రాదనీ అతడి మొఖంలో భావాలు చూపించలేడని బాలీవుడ్ మీడియా అతడి పై దుమ్మెత్తి పోసింది.
అయితే ఇప్పుడు అదే బాలీవుడ్ మీడియా చరణ్ పై ప్రశంసలు కురిపిస్తోంది. అంతేకాదు గతంలో అతడు నటించిన ‘రంగస్థలం’ మూవీ గురించి కూడ ప్రత్యేకంగా రాస్తోంది. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ ద్వారా తమకు బాలీవుడ్ మార్కెట్ బాగా పెరుగుతుంది అని ఆశించిన చరణ్ జూనియర్ కలలలో చరణ్ కలలు నెరవేరాయి అన్నమాటలు వినిపిస్తున్నాయి. ఈమూవీ రికార్డుల విషయం పక్కకు పెడితే ‘ఆర్ ఆర్ ఆర్’ ద్వారా చరణ్ కు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడటంతో భవిష్యత్ లో బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు..