కొత్త ఇంటి కోసం చరణ్ ఎన్ని కోట్లు ఖర్చు చేసాడో తెలుసా..?

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన సినిమా ఆర్.ఆర్.ఆర్ .ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది.ప్రస్తుతం rrr సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో పాటు రామ్ చరణ్ తన పుట్టినరోజు కూడా కావడంతో చరణ్ తన పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.ఇదిలావుండగా ఈ క్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే ఇక  రామ్ చరణ్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఈ మధ్యకాలంలో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే.


 అంతేకాకుండా తాజాగా ఈ ఇంటిని రామ్ చరణ్, ఉపాసన దంపతులు వారి అభిరుచికి అనుగుణంగా ఇంటర్నేషనల్ స్టైల్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, స్విమ్మింగ్ పూల్, పెయింటింగ్స్, జిమ్ సకల సదుపాయాలు ఉన్న ఇల్లు మరింత అందంగా కనిపించడం కోసం కొన్ని మార్పులు చేశారు.అంతేకాదు తాజా సమాచారం ప్రకారం సుమారు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఇంటిని రామ్ చరణ్ తన సొంతం చేసుకోవడం కోసం ఏకంగా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇక ఈ విధంగా తన అందమైన ఇంటిని తనకు నచ్చిన విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఇంటి కోసం రామ్ చరణ్ ఈ విధంగా 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంటిని కొనుగోలు చేశారట.


ఇదిలా వుండగా రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తన 16 సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పాన్ ఇండియా లెవెల్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: