మెగా స్టార్ మూడో సినిమా కూడా ఈ ఏడాదే..?

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి బాబీ దర్శకత్వంలో చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా. మొదట్లో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్స్ విషయంలో పలు రకాల వార్తలు వినిపించాయి కానీ చివరికి దర్శకుడు ఈ టైటిల్ కే ఎక్కువగా మొగ్గు చూపడంతో దీనిని ఫైనలైజ్ చేశారని చెప్పవచ్చు. ఇకపోతే మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు ఈ సినిమాతో మెగా అభిమానులను భారీ స్థాయిలో అలరిస్తారని మెగా కాంపౌండ్ చెబుతుంది.

పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన ఈ రచయిత ఆ తర్వాత ఎన్టీఆర్ తో జైలవకుశ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలను చేసి మంచి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అలా జైలవకుశ తర్వాత ఆయన చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరినీ భారీస్థాయిలో ఆలచిస్తుందని అందరూ నమ్ముతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది విడుదల చేసే విధంగా మెగాస్టార్ ఆలోచనచేస్తూ ఉండటం ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇప్పటికే ఆచార్య సినిమాను ఏప్రిల్ లో విడుదల చేస్తున్నాడు చిరంజీవి. ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాని కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని భావించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం అందించిన భోళా శంకర్ ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని ఆయన భావించగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాను కూడా వచ్చే ఏడాది విడుదల చేయాలని భావించడం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఏ ధైర్యంతో చిరంజీవి ఈ విధంగా తన సినిమాలను విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదు. యువ హీరోలకి సాధ్యం కాని విధంగా ఒకే సంవత్సరం నాలుగు సినిమాలను విడుదల చేయడం జరిగింది అంటే నిజంగా అది సామాన్యమైన విషయం కాదు. గతంలో చిరంజీవి యువ హీరో గా ఉన్నప్పుడు ఈ విధంగా సినిమాలు చేసేవాడు ఆ తర్వాత చాలా రోజులకు ఇలా సినిమాలు చేయడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: