పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు మరే హీరో చేతిలో లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఆ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు కావడం గమనార్హం. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. అయితే ఈ సినిమా ప్రేక్షకులను, అభిమానులను ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకోగా.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో 'ఆది పురుష్' సినిమా చేశాడు.
ఈ సినిమాతో పాటు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో 'ప్రాజెక్ట్ కె' అలాగే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్'... ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇక తాజాగా మీడియం బడ్జెట్ సినిమాల దర్శకుడు మారుతి డైరెక్షన్లో ప్రభాస్ ఒక సినిమాని చేయబోతున్న విషయం తెలిసిందే.' రాజా డీలక్స్' అనే టైటిల్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మారుతి కాంబోలో రాబోతున్న సినిమా పూర్తి హారర్ కామెడీ సినిమా అనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటిదాకా ప్రభాస్ హారర్ జానర్లో సినిమా చేసింది లేదు.మొదటిసారి మారుతి సినిమాలో ఈ జోనర్ ట్రై చేస్తున్నాడు ప్రభాస్. ఇక తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు కలుస్తాను. కథ ప్రకారం ఈ సినిమాలో బొమన్ ఇరాని దెయ్యం గా కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. ఈ సినిమా కథ ఓ ఇంటి చుట్టూ నడుస్తుందని.. కొన్ని అనివార్య పరిస్థితుల్లో హీరో ఆ ఇంటికి చేరడం.. ఆ తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఇక ఇదే స్టోరీలైన్ తో మారుతి తెరకెక్కించిన 'ప్రేమకథా చిత్రం' బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. మరోసారి ప్రభాస్ తో మారుతి ఇదే హారర్ జోనర్లో హిట్ కొడతాడేమో చూడాలి...!!