ఓ వర్గం ప్రేక్షకుల నుంచి ఆర్.ఆర్.ఆర్ చిత్ర దర్శక నిర్మాతలుకు ఇప్పుడు ఈ కంప్లైంట్ వస్తుంది. ఎందుకంటే కథ ప్రకారం సినిమాలో బ్రిటిష్ వాళ్ళు ఉంటారు.. వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంటారు.
దాదాపు 15 నిమిషాల సినిమాకు పైగా సినిమాలో ఇంగ్లీష్ డైలాగ్స్ ఉంటాయట.ముఖ్యంగా మెయిన్ విలన్ స్కాట్ దొర మాట్లాడేవన్నీ కూడా ఇంగ్లీష్ లోనే ఉంటాయి. ఆ డైలాగ్స్ మాస్ ఆడియన్స్ కు అర్థం కావడం లేదని కంప్లైంట్స్ వస్తున్నాయని తెలుస్తుంది.. కథ ప్రకారం అక్కడ జరిగేది ఏమిటో తమకు కూడా అర్థం కావాలి కదా అంటూ ఒక వర్గం ప్రేక్షకులు అందరూ అయితే రాజమౌళికి అర్జీ పెట్టుకుంటున్నారు.
దీన్ని దర్శక నిర్మాతలు ఎంతవరకు పరిగనణలోకి తీసుకుంటారు అనేది అర్థం కావడం లేదు. అక్కడ ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు కచ్చితంగా కింద తెలుగులో కూడా సబ్ టైటిల్స్ ఉంటే బాగుంటుంది అంటున్నారట ఆడియన్స్. అసలే బ్రిటిష్ ఇంగ్లీష్ అర్థం కావడం అంతంత మాత్రమే.. హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్లకు తప్ప మిగిలిన వాళ్లకు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం అంత ఈజీ అయితే కాదు.
అలాంటిది చిన్న చిన్న ఊర్లలో చూసే మాస్ ప్రేక్షకులకు త్రిబుల్ ఆర్ సినిమాలో ఉన్న ఇంగ్లీష్ అర్థం కావడం అసాధ్యం అంటున్నారట విశ్లేషకులు. అందుకే వాళ్లు కోరుకుంటున్న సబ్ టైటిల్స్ కచ్చితంగా ఉండాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాలు కూడా అంటున్నాయి. ఓవర్సీస్ లో ఎప్పుడూ సబ్ టైటిల్స్ తోనే సినిమా చూపిస్తారు.. కానీ ఇండియాలో మాత్రం అలా అస్సలు ఉండదు. ఇక్కడ ప్రాంతీయ భాషలో ఉంటాయి కాబట్టి ఎలాంటి సబ్ టైటిల్స్ కూడా లేకుండా సినిమా వస్తుంది.
సినిమాలో కొన్ని ఇంగ్లీష్ మాటలకు బ్యాక్ గ్రౌండ్‌లో తెలుగు వాయిస్ అయితే వస్తుంది. కానీ చాలా వరకూ ఇంగ్లీష్ డైలాగ్స్ అలాగే వదిలేశారు. వాటికి కూడా తెలుగు వర్షన్ ఇస్తే బాగుంటుంది అనేది ప్రేక్షకుల అభిప్రాయమట.. ఇప్పటికే సినిమా విడుదలై నాలుగు రోజులైంది. దాదాపు 500 కోట్ల కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇకపై కూడా ఖచ్చితంగా సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చేలా అయితే కనిపిస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో సబ్ టైటిల్స్ యాడ్ చేయాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారట.