శివ కార్తికేయన్ ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అయితే తాజా సమాచారం ప్రకారం నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా తన పారితోషికం ఇవ్వలేదని శివ కార్తికేయన్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఇకపోతే తనకు ఇవ్వవలసిన మొత్తంలో నాలుగు కోట్ల రూపాయలు ఎగొట్టారని ఆరోపించారు.అంతేకాకుండా ఇచ్చిన డబ్బులకు కూడా టీడీఎస్ కట్టలేదని ఆయన పేర్కొన్నారు. అయితే అసలు, ఈ గొడవ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...స్టార్ హీరో శివ కార్తికేయన్, నయనతార జంటగా నటించిన సినిమా 'మిస్టర్ లోకల్'. దీనికి కె.ఇ. జ్ఞానవేల్ రాజా. స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు.
ఈ సినిమా మే 17, 2019న విడుదలైంది. అయితే మూడేళ్ళ క్రితం విడుదలైన సినిమాకు ఇప్పుడు గొడవ ఏమిటి అంటే...గతంలోని ఆ సినిమాలో హీరో శివ కార్తికేయన్‌కు 15 కోట్ల రూపాయలు పారితోషికం ఇస్తామని జ్ఞానవేల్ రాజా ఒప్పందం చేసుకున్నారట. అయితే తనకు రూ. 15 కోట్లలో రూ. 11 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇక దానికి కూడా టీడీఎస్ కట్టలేదని,అంతేకాదు మిగతా నాలుగు కోట్లు ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టులో శివ కార్తికేయన్ కేస్ వేశారు. ఇకపోతే ఆ రూ. 11 కోట్లకు రూ. 91 లక్షలు టీడీఎస్ కట్ అయ్యిందట.అయితే ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న 'రెబల్', 'చియాన్ 61', 'పత్తు తల' సినిమాల్లో ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ఇక అలాగే థియేట్రికల్ అండ్ ఓటీటీ రైట్స్ అమ్మకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును శివ కార్తికేయన్ కోరారు.
ఇకపోతే 'రెమో', 'శక్తి', 'సీమ రాజా', 'వరుణ్ డాక్టర్' తదితర అనువాద సినిమాలతో తెలుగులో కూడా విజయాలు అందుకున్న శివ కార్తికేయన్, తాజాగా ఇప్పుడు 'జాతిరత్నాలు' ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో తెలుగు - తమిళ బైలింగ్వల్ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. ఇక ఈ సినిమా కోసం శివకార్తికేయన్ భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా తర్వాత కమలహాసన్ తో ఓ మల్టీస్టారర్ సినిమా కూడా శివకార్తికేయన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!