జక్కన్న పై అలియా అందుకే సీరియస్ అయ్యిందా?

Satvika
బాలివుడ్ భామలకు తెలుగులో డిమాండ్ భారీగా పెరిగింది. ఒక్కో హీరోయిన్ ఒక్కో విధమైన పాత్రలో కనిపిస్తూ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తెలుగులో పలు సినిమాలలో నటిస్తున్నారు.. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ బిజిగా ఉన్నారు.. ప్రస్తుతం తెలుగులో అలియా భట్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. రెండు మూడు సినిమాలలో అలియా నటిస్తుంది. ఇటీవల అలియా తెలుగులో నటించిన సినిమా ఆర్ఆర్ఆర్.. ఆ సినిమా మొన్నీమధ్య విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకుంది.


రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా కనిపించిన ఆలియాకి చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరకకపోయినప్పటికీ తన నటనతో బాగానే మెప్పించింది.నిజానికి ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోయిన్లు ఆలియా భట్, ఒలివియా మోరిస్, సిరియర్ హీరోయిన్ శ్రీయ లలో అలియా భట్ పాత్ర కాస్త ఎక్కువగానే ఉంటుంది. హిందీ హీరోయిన్ అయిన  అలియాకు జక్కన్న ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, మిగిలిన ఇద్దరూ హీరోయిన్లకు తక్కువ స్క్రీన్ ఇవ్వడం పై అభిమానులు షాక్ అవుతున్నారు. మొదటి నుంచి అలియాకు డైరెక్టర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.. సినిమా ప్రమోషన్లో కూడా అలియానే ఎక్కువగా మెరిసిన విషయం తెలిసిందే..


ఇకపోతే అలియా భట్ ఈ సినిమా పై కొంత నిరాశ చెందినట్లు తెలుస్తుంది. అది కూడా సినిమా లో తన పాత్ర తనకూ కొంత ఇబ్బంది కలిగించింది అని ఆమె ఫీల్ అవుతుందని ఉహగానాలు వినిపిస్తున్నాయి.. సినిమా విడుదల సమయంలో కూడా ఆలియా భట్ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. దానికి సంబంధించిన పోస్ట్ లు కూడా పెట్టలేదు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని అన్ ఫాలో చేసిందని తెలుస్తుంది. గతంలో ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన పోస్టులను పెట్టింది. తర్వాత వాటిని డిలీట్ చేసింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అలియా ఇప్పుడు తెలుగు లో ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు మరో సినిమా లో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: