బాలీవుడ్ మౌనంలో ఆర్ ఆర్ ఆర్ !

Seetha Sailaja
తెలుగురాష్ట్రాలలో ‘ఆర్ ఆర్ ఆర్’ కలక్షన్స్ ప్రభంజనం కొనసాగుతోంది. ఈమూవీ కలక్షన్స్ దక్షిణాది రాష్ట్రాలలో కూడ సంతృప్తి కరంగా ఉన్నాయి. ఈమూవీ పై విపరీతమైన విమర్శలు పట్టించుకోకుండా బాలీవుడ్ ప్రేక్షకులు ఈమూవీకి హిట్ రేటింగ్ ఇవ్వడం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.


ఆమధ్య విడుదలైన ‘పుష్ప’ మూవీకి బాలీవుడ్ లో మంచిస్పందన రావడంతో పాటు లేటెస్ట్ గా విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ క్రిటిక్స్ రేటింగ్స్ దక్కకయినా ఈమూవీకి వస్తున్న మంచి కలక్షన్స్ చాలమందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇదిచాలదు అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25 నుంచి 27 వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ కు చిత్రానికి 64 మిలియన్ డాలర్లు కలక్షన్స్ వస్తే హాలీవుడ్ మూవీలు 'బ్యాట్ మ్యాన్' మూవీకి 45.5 మిలియన్ డాలర్లు 'ది లాస్ట్ సిటీ' కి 34.7 డాలర్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం తెలుగు సినిమా సత్తాను చాటుతోంది.


ఈసినిమా పై దక్షిణాది సినిమా ప్రముఖులు అంతా ప్రశంసలు కురిపిస్తూ ఉంటే ఈమూవీ పై బాలీవుడ్ ప్రముఖులు ఎవరు స్పందించకపోవడం టాపిక్ ఆఫ్ ది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా మారింది. అయితే బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ లు తప్పించి ఇప్పటివరకు ఈమూవీ గురించి బాలీవుడ్ సెలెబ్రెటీలు ఎవరు మాట్లాడటంలేదు. భారతదేశంలోని ఏభాషలో మంచి సినిమా వచ్చినా వెంటనే స్పందించే అమితాబ్ అమీర్ ఖాన్ లాంటి పెద్ద హీరోలు కూడ ఈమూవీ పై మౌనం వహిస్తున్నారు.


దీనితో దక్షిణాది సినిమా ఆదిపత్యం పై బాలీవుడ్ ఇండస్ట్రీ అదేవిధంగా బాలీవుడ్ మీడియా తీవ్ర అసహనంలో ఉందా అన్నచర్చలు మొదలైపోయాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ హీరోలు అంతా పాన్ ఇండియా స్టార్స్ గా మారాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పై బాలీవుడ్ లో నెగిటివ్ పరాచారం మొదలైంది. ‘ఆర్ ఆర్ ఆర్’ కలక్షన్స్ బాగున్నప్పటికీ చరణ్ జూనియర్ లకు బాలీవుడ్ మీడియాలో ఆశించిన స్థాయిలో గుర్తింపు రావడంలేదు. అయితే అల్లు అర్జున్ ‘పుష్ప’ లోని పుష్ప రాజ్ పాత్రకు మాత్రం బాలీవుడ్ ప్రశంసలు లభించడంతో మన హీరోలు పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి ఎంచుకుంటున్న పాత్రలలో లోపమా లేదంటే బాలీవుడ్ టాలీవుడ్ టాప్ హీరోల పై వివక్షిత ప్రదర్శిస్తోందా అంటూ అనేక చర్చలు జరుగుతున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: