ఆచార్య సినిమాలో.. చిరు, చరణ్ సీన్స్ నిడివి ఎంతో తెలుసా?

praveen
ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ త్రిబుల్ ఆర్. సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్ చరణ్. ఇక ఈ సినిమాలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్చరణ్ నటించి ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్ధుల్ని చేసాడు అని చెప్పాలి. ఇక రామ్చరణ్ కనిపించిన ప్రతి సన్నివేశంలో అతని నటనకు అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇక త్రిబుల్ ఆర్ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఇక మరికొన్ని రోజుల్లో మరోసారి తండ్రితో కలిసి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమై పోయాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా మెగాస్టార్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


 ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. తొలిసారి తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ ఉండటం గమనార్హం. కాగా ఇందులో మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ రామ్ చరణ్కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇక ఆచార్య సినిమాలో సోనూసూద్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.


 ఇక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నిర్మాత అన్వేష్ రెడ్డి ఇక ఈ సినిమాలో చిరు-చరణ్ స్క్రీన్ షేరింగ్ టైం ఎంత ఉంటుంది అన్న విషయాన్ని పొరపాటున చెప్పేసాడు. ఆచార్య లో చరణ్ చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు గొప్ప ట్రీట్ అని వెల్లడించారు అన్వేష్ రెడ్డి. ఇంతకుముందు వారిద్దరూ స్క్రీన్ పై కనిపించారు కాని కేవలం అతిధి పాత్రలకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ ఆచార్య సినిమాలు మాత్రం 20 నుంచి 25 నిమిషాల పాటు స్క్రీన్ స్పేస్ ను పంచుకో బోతున్నారు అంటూ నిర్మాత అన్వేష్ రెడ్డి అసలు సీక్రెట్ రివిల్  చేసేసారు. అయితే దాదాపు ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు ఇద్దరు తండ్రి కొడుకులు కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అని తెలిసి అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: