సూర్య తో నటించడానికి కృతి శెట్టి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

Divya
కర్ణాటక ప్రాంతంలో మంగళూరు నుంచి వచ్చిన ఎంతో మంది హీరోయిన్ లలో హీరోయిన్ కృతి శెట్టి కూడా ఒకరు.. తన చిన్న వయసులోనే పలు కంపెనీల లో యాడ్స్ లో నటించింది. చదువుకుంటూనే..మరొకవైపు తన తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ వైపు అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. మొదటగా హృతిక్ రోషన్ తో 2019 లో వచ్చిన సూపర్-30 అనే చిత్రంలో ఒక చిన్న రోల్ చేసింది.. ఆ తరువాత మెగా హీరోయిన్ వైష్ణవి తేజు తో ఉప్పెన చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో ప్రేక్షకుల మనసును దోచుకుంది.
టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది కృతి శెట్టి. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకుంది. అయితే తమిళ హీరో సూర్య నటిస్తున్న తన 41వ చిత్రాన్ని డైరెక్టర్ బాల దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపుగా వీరిద్దరి మధ్య సినిమా రాక 18 సంవత్సరాలు అయ్యింది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ అమ్మడు ఈ సినిమాకు అందుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడూ పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటివరకు ఈమె తెలుగు సినిమాల కు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నది.
అయితే సూర్య చిత్రానికి మాత్రం రూ.1.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఆమెకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు సైతం అందుకు ఒప్పుకున్నట్లు గా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కృతి శెట్టి హీరో రామ్ తో కలిసి ది వారియర్, సుధీర్ బాబు తో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. నితిన్ తో మాచర్ల నియోజకవర్గం. వంటి సినిమాలలో నటిస్తున్నది. ఈ సినిమాలు  షూటింగు చివరి దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: