చిరంజీవితో నా సినిమా అందుకే ఆగిపోయింది : పూరీ జగన్నాథ్

Anilkumar
పూరి జగన్నాథ్... రామ్ గోపాల్ వర్మ స్కూల్లో నుండి వచ్చిన ఒక దర్శకుడు. ఈయన మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బద్రి అనే సినిమా ను తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఇక ఈయన ఫస్ట్ మూవీతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నారు. దాని అనంతరం మహేష్ బాబు తో పోకిరి సినిమా తెరెకెక్కించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్ సృష్టించి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.అయితే  బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, వంటి సినిమాలతో ఈయన  పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో హిట్స్ అందుకున్నాడు.ఇక  తనకు మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందని పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించిన విషయం చాలాసార్లు మనం విన్నాం.


అయితే  ఒకానొక సందర్భంగా ఆ అవకాశం కూడా అందుకున్నాడు.కాగా  హఠాత్తుగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా ఆగిపోయింది. ప్రస్తుతం తాజాగా ఇదే విషయంపై పురీ జగన్నాథ్ తన మనసులో మాటని మళ్ళీ వ్యక్తం చేశాడు.అయితే పూరీజగన్నాథ్‌ కలల ప్రాజెక్ట్‌గా ‘జనగణమన’ ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనున్నదని అధికారికంగా ప్రకటించాడు.ఇకపోతే  దేశభక్తి నేపథ్యంలో సాగే కథతో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో విజయ్ దేవకొండ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ అధికారికంగా జనగణమన మూవీ గురించి ప్రకటిస్తున్న సందర్భంలో దర్శకుడు పురీ జగన్నాథ్ పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరిగింది.


 అయితే  అందులో భాగంగా.. మీరు చిరంజీవితో సినిమా చేయాలనుకున్నారు కదా… ఇక ఆ ప్రాజెక్ట్‌ ఏమైందని అడిగిన ప్రశ్నపై పురీ స్పందించారు.ఆయన మెగాస్టార్ చిరంజీవికి కమర్షియల్‌ కథ చెప్పానని .. అంతేకాదు ఆ కథ చిరుకు కూడా నచ్చింది. తాజాగా ఇప్పుడు   ప్రస్తుతం చిరంజీవి సమాజానికి ఉపయోగపడేలా మెసేజ్‌ ఓరియెంటెండ్‌ సినిమాలు చేయాలనీ భావిస్తున్నారు. అయితే అందుకనే చిరంజీవి తో నా ప్రాజెక్ట్ చేజారిపోయిందని పురీ జగన్నాథ్ చెప్పారు. ఇకపోతే ఈ సందర్భంగా హీరో విజయ్ దేవకొండ మాట్లాడుతూ.. పూరీ జగనాథ్ త్వరలో వెండి తెరపై నటుడిగా అడుగు పెట్టనున్నారని.. అంతేకాకుండా చిరంజీవి సినిమాలో నటించనున్నారని చెప్పాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: