RRR సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే రామ్ చరణ్ మరోవైపు ''ఆచార్య'' సినిమాని కూడా పూర్తి చేశారు. కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకమైన రోల్ లో కనిపించనున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం తెలుస్తుంది.అప్పుడెప్పుడో పూర్తైన 'ఆచార్య' సినిమాని ఏప్రిల్ 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ఇంకా హిందీతో పాటుగా పలు ఇతర భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు rrr సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. రామ్ చరణ్ కి నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చింది. అదే ఇప్పుడు ఆచార్య సినిమాకి ప్లస్ అవుతుంది. ఇక ఇదే క్రమంలో 'ఆచార్య' సినిమా ప్రచారానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం తెలుస్తోంది.రామ్ చరణ్ హోమ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి 'ఆచార్య' సినిమాని నిర్మించారు.
రామ్ చరణ్ ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడానికి తన భుజాల పై వేసుకుని ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నాడట.'RRR' సినిమా కోసం నేషనల్ వైడ్ ప్రచారంలో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు 'ఆచార్య' సినిమా కోసం మళ్లీ అలాంటి ప్రచారమే చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఆర్.ఆర్.ఆర్ మూవీ విజయంతో రామ్ చరణ్ కి నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదే ఆచార్యకు స్పెషల్ ఎట్రాక్షన్ తీసుకొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.'సైరా' సినిమాతో ప్రభావం చూపలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి బాలీవుడ్ లో సత్తా చాటాలని తెగ ఆశ పడుతున్నారు. దీనికి ఇప్పుడు కుమారుడు కూడా తోడయ్యాడు. అందుకే రిలీజ్ కు పది రోజుల ముందు అగ్రిసివ్ గా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ షెడ్యూల్స్ ని రూపొందిస్తోందట. బాలీవుడ్ మీడియాకి మెగా తండ్రీకొడుకులు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారట.