మహేష్ అభిమానులకు ఉగాది కానుక..!!
మాస్ సినిమాలతో పాటు యాక్షన్ , లవ్ , రొమాంటిక్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించగలిగే సత్తా మహేష్ బాబు లో ఉంది . ముఖ్యంగా ఆయన నటించే ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా కమర్షియల్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.. అంతేకాదు ఈయన సినిమాలలో నటిస్తే చాలు విజయం, పరాజయం తో పని లేకుండా ఆ సినిమా కచ్చితంగా కలెక్షన్ల విషయంలో దూసుకుపోతాడు మహేష్ బాబు.
మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి పోస్ట్ అలాగే పాటలు కూడా మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక సినిమా ప్యాచ్ వర్క్ మినహా మిగతా పనులన్నీ పూర్తయ్యాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించగా.. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా వదిలిన కళావతి పాట కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ నమోదు చేసుకోవడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి విడుదలైన సెకండ్ పాట పెన్నీ పాట కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇందులో మహేష్ కూతురు సితార కూడా మెరిసి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు మరొకసారి ఉగాది కానుకగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.