పెళ్లి కాకముందు వసుందర - బాలయ్య కలిసున్న ఫోటో వైరల్..!

Divya
నందమూరి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ.. చిన్నప్పటి నుంచి మనం వెండితెరపై కూడా ఈయనను చూస్తూనే ఉన్నాము. ఇక బాలకృష్ణ లో ఏ రూపంలో ఉన్నా సరే గుర్తు పట్టడం చాలా సులభమని చెప్పవచ్చు. అంతేకాదు ఎంతమందిలో ఉన్నా సరే బాలయ్య బాబు ను ఈజీ గా గుర్తు పట్టవచ్చు కానీ ఈ ఫోటోలో ఆయన పక్కన ఉన్నది ఎవరు అంటే మాత్రం అంత త్వరగా గుర్తుపట్టలేరు. ఎందుకంటే దాదాపుగా 35 సంవత్సరాల క్రితం తీసిన ఒక ఫోటో ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది. ఇందులో బాలకృష్ణను సులభంగా గుర్తు పెట్టిన ఆయన పక్కన ఉన్న ఆవిడ ఎవరో గుర్తు పట్టడానికి కాస్త సమయం కావాలంటున్నారు చేసినవారు..

ఎవరో కాదు స్వయానా బాలయ్య బాబు ధర్మపత్ని వసుంధర. అయితే పెళ్లి కాక ముందు వీరిద్దరూ కలిసి తీసుకున్న ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ గా మారింది. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్యబాబు తెరపై ఒక వెలుగు వెలిగారు.. పక్కన వసుంధర హీరోయిన్ లా  ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ - వసుంధర ల పెళ్లి నాటకీయ పరిణామాలలో జరిగిందని చెబుతూ ఉంటారు. వసుంధర - బాలకృష్ణ ను సినిమా లో చూసి పెళ్లికి సిద్ధం అయ్యారు. ఇకపోతే వీరిద్దరి అన్యోన్య దాంపత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు , ఒక అబ్బాయి కూడా ఉన్నారు.
కూతుర్లు కూడా ఉన్నత కుటుంబాలకు కోడలిగా వెళ్లగా. కొడుకు మోక్షజ్ఞ సినిమాలలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2025 లో ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య బాబు కూడా తన కొడుకుతో కలిసి ఒక సినిమాలో నటిస్తానని ఇప్పటికే ఇంటర్వ్యూలో చెప్పినా అభిమానులు మాత్రం ఆ దృశ్య కావ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: