మెగాస్టార్ చేతుల మీదుగా.. తమిళ హీరో సినిమా టీజర్?
కాస్త క్రేజ్ వున్న హీరోల సినిమాలకు మాత్రమే కాదు అప్పుడప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నా యువ హీరోల సినిమాలకు సంబంధించిన ఫంక్షన్ లకు సైతం స్పెషల్ గెస్ట్ గా వస్తున్నారు. ఇక ఇక యువ హీరోలు అందరికీ కూడా చిత్ర పరిశ్రమలో రాణించడానికి తన వంతు సహకారం ప్రోత్సాహం అందిస్తున్నారు. అయితే కేవలం టాలీవుడ్ హీరోల విషయంలోనే కాదు అటు కోలీవుడ్ హీరోల విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి సహాయ సహకారాలు అందిస్తూ కళామతల్లికి అసలైన ముద్దుబిడ్డ గా పేరు సంపాదించుకున్నారు అని తెలుస్తోంది.
తమిళ హీరో కిచ్చ సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో విలన్ పాత్రలో నటించిన కిచ్చ సుదీప్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల అందరినీ ఆకర్షించాడు. అంతే కాకుండా అందరికీ సుపరిచితుడిగా కూడా మారిపోయాడు. ఆ తర్వాత బాహుబలి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక అటు తమిళంలో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు కిచ్చ సుదీప్. ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విక్రం రోణా అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు చిత్ర బృందం. ఇకపోతే ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయబోతున్నారు అంటూ కిచ్చ సుదీప్ ఇటీవలె సోషల్ మీడియా లో తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ఇక సినిమా టీజర్ మెగాస్టార్ చేతులమీదుగా విడుదలవుతుందని కిచ్చ సుదీప్ చెప్పుకొచ్చారు..