తన కెరీర్ స్టార్టింగ్ లో సౌత్ ఇండస్ట్రీలో తనను గ్యాస్ ట్యాంకర్ అంటూ వెక్కిరించారని రాశీఖన్నా ఇదివరకు తెలిపింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత తను రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డానని.. తనను అలా మార్చేశారని ఆమె చెప్పింది. కమర్షియల్ సినిమాల్లో హీరోల పక్కన కొద్దిసేపు కనిపించడం పక్కకు వెళ్లిపోవడం లాంటి రొటీన్ ఫార్ములాను తనకు బాగా అలవాటు పడేలా చేశారని ఆమె చెప్పుకొచ్చింది.సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను టాలెంట్ తో కాకుండా లుక్స్ పరంగా గుర్తింపునిస్తారని.. అది తనకు నచ్చదని ఆమె తెలిపింది. కొంచెం తెల్లగా బాగా ఉంటే చాలు మిల్కీ బ్యూటీ అనేస్తారని.. కానీ అంతకుమించిన టాలెంట్ హీరోయిన్స్ లో ఉంటుందని ఇప్పటికైనా దాన్ని సౌత్ ఆడియన్స్ గుర్తించాలని రాశి ఖన్నా హద్దులు దాటి హాట్ కామెంట్ చేసింది.ఇక రాశీఖన్నా చేసిన ఈ కామెంట్స్ పై సౌత్ సినీ అభిమానులు చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. గుర్తింపు తెచ్చిపెట్టిన ఇండస్ట్రీని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయిందంటూ రాశీపై ఫైర్ అవుతున్నారు.
నిజానికి 'మద్రాస్ కేఫ్' అనే రొట్ట హిందీ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన రాశీకి 'ఊహలుగుసగుసలాడే' సినిమాతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందించింది టాలీవుడ్.అప్పటి నుంచి వరుసగా ఛాన్సెస్ అందుకుంటూ.. తెలుగు తమిళ మళయాళ హీరోలతో నటిస్తూ ఈమె వచ్చింది. ఇప్పడు 'రుద్ర' అనే వెబ్ సిరీస్ తో మళ్లీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ ఇప్పుడు ఛాన్సులు వస్తున్నాయేమో కామెంట్స్ చేస్తున్నారు.సౌత్ ఇండస్ట్రీ వల్ల తనలో ఇంత టాలెంట్ ఉందనే విషయమే మర్చిపోయాననే విధంగా నోరు పారేసుకొని ఇక్కడి అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.రాశీ ఖన్నా లాగానే గతంలో పలువురు హీరోయిన్లు దక్షిణాది చిత్ర పరిశ్రమ మీద ఈ విధంగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజాహెగ్డే.. ఆ మధ్య సౌత్ మీద అనవసరమైన కామెంట్స్ చేసింది. ఇక్కడి ఆడియన్స్ కి నడుము అంటే చాలా ఇష్టమని కేవలం మిడ్ డ్రెస్ ల్లోనే చూడాలనుకుంటారని.. అందుకే సినిమాల్లో కచ్చితంగా హీరోయిన్ నడుము మీదే కాన్సన్ట్రేట్ చేస్తారని పూజా హెగ్డే తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.