ఊ అంటావా.. ఉహూ అంటావా పాటపై.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ డాన్స్ చేస్తే?
ప్రస్తుతం తెలుగు బుల్లి తెర పై టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న కార్యక్రమాలలో ఇక ఈ కార్యక్రమం కూడా ఉంది అని చెప్పాలి. ఇందులో ఎప్పుడు సరికొత్త కాన్సెప్ట్ లతో కూడిన డాన్స్ పెర్ఫార్మన్స్ లు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో అయితే ఇటీవల వచ్చే వారానికి వాటికి సంబంధించిన ప్రోమో విడుదలయి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమోలో భాగంగా ఒక అదిరిపోయే పర్ఫామెన్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి.. ఒక పర్ఫామెన్స్ ఫుల్ ఎపిసోడ్ లో అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.
ఇంతకీ ఆ పర్ఫామెన్స్ ఎందుకు అంత స్పెషల్ అని అనుకుంటున్నారు కదా.. ఇటీవలె విడుదలైన పుష్ప సినిమాలో సమంత నటించిన ఊ అంటావా ఉహూ అంటావా అనే సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇదే పాటని డాన్స్ రియాలిటీ షో ఢీ లో చేశారు. అందులో కొత్తగా ఏముంది అని అనుకుంటున్నారు కదా. ఊ అంటావా పాటపై ఎన్టీఆర్ ఏఎన్నార్ వచ్చి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది ఇక అలాంటి పర్ఫామెన్స్ చేసి చూపించా.రుదీంతో ఇక ఇది చూసి ఆడియాన్స్ అందరూ ఫిదా అయ్యారు అని చెప్పాలి..