నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం విడుదలైన అఖండ మొవు తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే, బోయపాటి శీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ మూవీ కి కలెక్షన్ లు కూడా అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, పూర్ణ ముఖ్య పాత్రలో నటించింది, శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ , గోపిచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది, అలాగే ఈ సినిమాలో దునియా విజయ్ , వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు, ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
ఇలా గోపిచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నా నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా లవ్ రెడ్డి సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేసి యంగ్ టీమ్ కలిసి చేస్తున్న లవ్ రెడ్డి మూవీ పెద్ద విజయం సాధించాలి అని అన్నారు. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటిస్తున్న ఈ మూవీ కి స్మరణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు, స్మరణ్ రెడ్డి ఈ మూవీ తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఎమ్జీఆర్ ఫిలిమ్స్, గీతాన్ష్ ప్రొడక్షన్స్, సెహరి స్టూడియోస్ బ్యానర్స్‌పై హేమలతా రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజన్ రెడ్డి, నాగరాజు బీరప్ప ఈ మూవీ ని నిర్మిస్తున్నారు, ఆంధ్ర–కర్ణాటక సరిహద్దు లో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ లవ్ రెడ్డి మూవీ, ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ 80 శాతం వరకు పూర్తి అయ్యింది, మిగిలిన షూటింగ్ ని కర్ణాటక లోని బాగేపల్లి, చిక్బల్లాపూర్, బెంగళూరు లో చిత్రీకరించనున్నాం’’ అని చిత్ర బృందం పేర్కొంది.