ఆది
సాయికుమార్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఆది
సాయికుమార్ , ఇషా చావ్లా
హీరోయిన్ గా తెరకెక్కిన
ప్రేమ కావాలి
మూవీ తో
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమ కథతో తెరకెక్కిన
ప్రేమ కావాలి
మూవీ మంచి విజయాన్ని సాధించడంతో పాటు
ఆది సాయికుమార్ కు కూడా
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తీసుకు వచ్చింది, ఆ తర్వాత
ఆది సుకుమార్ 'లవ్లీ' సినిమాలో హీరోగా నటించాడు. ప్రేమ కథతో తెరకెక్కిన లవ్లీ
సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది, ఇలా రెండు విజయవంతమైన సినిమాలతో
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న
ఆది సాయికుమార్ ఆ తర్వాత నటించిన సినిమాల ద్వారా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు.
ఇలా వరుస పరాజయాలను ఎదుర్కొంటు
బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయిన
ఆది సాయి కుమార్ ప్రస్తుతం బ్లాక్ అనే సినిమాలు నటిస్తున్నాడు, బ్లాక్ సినిమాకు బి
కృష్ణ దర్శకత్వం వహించాడు, ఈ
మూవీ లో
ఆది సాయి కుమార్ కు జంటగా
దర్శన బానిక్ నటించింది. ఈ సినిమాను మహంకాళి దివాకర్ నిర్మించారు, ఈ సినిమాను ఏప్రిల్ 22 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో
ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ
మూవీ లో పోలీసాఫీసర్‌గా
ఆది గారి నటన, కథ కొత్తగా ఉంటాయి,
మూవీ ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. ఈ నెల మొదట వారం లో ఈ
మూవీ ట్రైలర్ ను , అలాగే ఏప్రిల్ 22 వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తాం అని చిత్ర బృందం పేర్కొంది, మరి బ్లాక్ సినిమాతో
ఆది సాయికుమార్ ఎలాంటి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకుంటాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.