రాధే శ్యామ్ తో వచ్చిన నష్టాలను ఆ సినిమాతో వెనక్కు తెచ్చుకుంటున్న దిల్ రాజు..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రముఖ నిర్మాత గా కొనసాగుతున్న దిల్ రాజు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  దిల్ రాజు తన కెరియర్ ను డిస్ట్రిబ్యూటర్ గా మొదలు పెట్టి,  ఆ తర్వాత నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.  దిల్ రాజు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూనే వీలుచిక్కినప్పుడల్లా సినిమాలను డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉంటాడు,  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన రాధే శ్యామ్ సినిమాను దిల్ రాజు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశాడు. రాధే శ్యామ్  సినిమా విడుదలకు ముందే మంచి అంచనాలు ఉండటంతో ఈ సినిమా నైజాం రైట్స్  ను దిల్ రాజు భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది,  ఇది ఇలా ఉంటే రాధే శ్యామ్  సినిమా విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు మిక్సీడ్  టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్ లను రాబట్టలేకపోయింది.


రాధే శ్యామ్ మూవీ దిల్ రాజు కు నైజాం ఏరియాలో 15 కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది,  ఇలా రాధే శ్యామ్ మూవీ తో దిల్ రాజు 15 కోట్ల వరకు నష్టపోయినట్లు సమాచారం.  ఇది ఇలా ఉంటే దిల్ రాజు ,  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ని కూడా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశాడు,  ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు 70 కోట్ల వరకు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే దిల్ రాజు ఆర్ ఆర్ ఆర్ సినిమాపై పెట్టిన పెట్టుబడి వారం రోజుల్లోనే తిరిగి వచ్చింది,  ఇక ఈ వారం ఉగాది ఫెస్టివల్ వుండడం ఈ సినిమాకు మరింత కలిసి వచ్చే అంశం గా కనబడుతుంది.  ఆర్ ఆర్ ఆర్ సినిమా దాదాపు 100 కోట్ల షేర్ సాధించే అవకాశాలు ఉండడంతో రాధే శ్యామ్ సినిమాతో వచ్చిన నష్టాలను ద
 ఆర్ ఆర్ ఆర్ తో దిల్ రాజు వెనక్కి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: