తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల జోరు చాలా వరకు తగిన సమయంలో వెంకటేష్, మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో నటించారు, ఇలా ఇద్దరు హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై అప్పట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి విజయం సాధించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు అయితే తెరకెక్కుతున్నాయి కానీ ఒకే రేంజ్ స్టార్ డమ్ ఉన్న హీరోలు, అలాగే దాదాపు ఒకే వయసు ఉన్న హీరోలు మాత్రం కలిసి నటించలేదు, అయితే అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే రేంజ్ స్టార్డం ఉండి, దాదాపు ఒకే వయసు కలిగి ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు స్టార్ హీరోలతో దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ కొన్ని రోజుల క్రితమే మార్చి 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది , విడుదలైన మొదటి షో నుండే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని కొత్త రికార్డులను సృష్టిస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందుకు దూసుకుపోతోంది, ఇలా ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు దూసుకుపోతున్న ఆ సమయంలో ఆర్ ఆర్ ఆర్ 2 కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ కి కథను అందించిన స్టార్ రైటర్.. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు, అసలు విషయం లోకి వెళితే... ఆర్ ఆర్ ఆర్ 2 మూవీ కథా చర్చలు జరుగుతున్నాయని, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి ఇంటికి వచ్చారట . ఆ సమయంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి చర్చలు వచ్చాయట, ఆర్ ఆర్ ఆర్ 2 మూవీ చేస్తే బావుంటుందనే ఐడియా కూడా రావడం, కొన్ని పాయింట్లు విజయేంద్రప్రసాద్ చెప్పడం జరిగిందట. ఆ పాయింట్లు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా బాగా నచ్చాయట, అన్ని కుదిరితే ఆర్ ఆర్ ఆర్ 2 రూపొందే అవకాశం ఉందని రీసెంట్ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ తెలిపారు.