రాజమౌళి మహాభారతంలో ఎన్టీఆర్ చేసే పాత్రలు అవేనా...?
ముఖ్యంగా తన కలల చిత్రం అయిన `మహా భారతం`ను తీయాలని జక్కన్న ఆశ పడుతున్నాడు. ఈ సినిమాని 5 భాగాలుగా తీయాలన్నది రాజమౌళి ఆలోచనట.. పైగా ఈ సినిమాతో తన కెరీర్‌కి పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను అని కూడా ఆ మధ్య జక్కన్న చెప్పుకొచ్చాడు.
అన్నిటికీ మించి ఈ సిరీస్ లో కీలక పాత్ర అయిన కృష్ణుడు పాత్ర కోసం అమీర్ ఖాన్ కి ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పి.. ఓకే చేయించుకున్నాడట.. అయితే, ఈ సినిమాకి సంబంధించి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా కనీసం ఐదేళ్లు పడుతుంది. అయితే.. ఈలోగా.. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. రచయిత విజయేంద్రప్రసాద్ `మహా భారతం` స్క్రిప్టు పనులు కూడా మొదలెట్టేశారని తెలుస్తోంది.
నిజానికి మహేష్ బాబు సినిమాను ఆరు నెలలు పోస్ట్ పొన్ చేసి మరీ రాజమౌళి మహాభారతం సినిమా స్క్రిప్ట్ పై కూర్చుంటున్నాడట.. సీనియర్ ఎన్టీఆర్ తెలుగు వాళ్లకు ఎలా అయితే, దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారో అచ్చం అలాగే భారతీయ పురాణ ఇతిహాసాలను ప్రపంచానికి ఒక తెలుగువాడిగా చాటి చెప్పాలని రాజమౌళి చిరకాల కోరిక అని తెలుస్తుంది..
గత కొన్ని సంవత్సరాలుగా రాజమౌళి మైండ్ సెట్ బాగా మారిందట. అయితే, తాజాగా రాజమౌళి గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అయితే తెలిసింది. మహాభారతానికి సంబంధించిన నలుగురి ప్రముఖుల రచనలను అయితే రాజమౌళి చదువుతున్నారట. రానున్న నాలుగైదు సంవత్సరాలలో మహాభారతం సిరీస్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాలని రాజమౌళి బాగా కోరికతో ఉన్నాడు.
ఇక ఈ సిరీస్ లో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించే అవకాశం కూడా ఉందట. ఒకటి కృష్ణుడు (తెలుగు వెర్షన్ కి మాత్రమే) మరొకటి కర్ణుడి పాత్ర (ఇది అన్నీ వర్షన్స్ లో) అని సమాచారం.. ఈ రెండు పాత్రల్లోని హెవీ ఎమోషన్ పండాలంటే తారక్ లాంటి ఈ తరం మహానటుడే పండించగలడని రాజమౌళి నమ్మకం.. మరి మహాభారతం ఏ సంవత్సరంలో మొదలవుతుందో చూడాలి మరి.