బ్లైండ్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్..!

Pulgam Srinivas
వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ సినిమాల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది,  తెలుగు లో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి సినిమాలో ప్రతినాయక పాత్రలో కనిపించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో  అవకాశాలను మాత్రం బాగానే దక్కించుకుంటోంది.  ఆ మధ్య విడుదలైన క్రాక్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది,  ఈ సినిమా మంచి విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కు మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి,  అందులో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం అనేక క్రేజీ తెలుగు సినిమా అవకాశాలు దక్కించుకుంది.


  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ బ్లైండ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది,  ఇప్పటి వరకు ఎంతో మంది బ్లైండ్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  ఈ మధ్య కాలంలో రవితేజ 'రాజా ది గ్రేట్'  సినిమాలో బ్లైండ్ పాత్రతో ప్రేక్షకులను అలరించాడు,  రాజ్ తరుణ్ 'అందగాడు'  సినిమాలో బ్లైండ్ పాత్రలో ప్రేక్షకులను అలరించాడు,  అలాగే నితిన్ 'మాస్ట్రో'  సినిమాలో బ్లైండ్ పాత్రల్లో అలరించాడు.  ఇది ఇలా ఉంటే గత యేడాది కోలీవుడ్ స్టార్ వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళం లో ‘సింగ పార్వై’ సినిమా లో  బ్లైండ్ పాత్ర లో నటించింది,  భరత్ రెడ్డి, రవి కాలే, తలైవాసల్ విజయ్, పాండీ కీలక పాత్రలు పోషించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని త్వరలో తెలుగు లో ‘వర ఐపీఎస్’ పేరు తో విడుదల కాబోతోంది,  మరి ఈ మూవీ తో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: