రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?
ఇంతకీ ఏం జరిగిందంటే.. హైదరాబాద్ నగరంలోని పబ్ లపై నిన్న రాత్రి పోలీసులు వరుసగా దాడులు చేశారు. ఇక పరిమితికి మించిన సమయం పాటు పబ్ లను నడుపుతున్న వారిపై చర్యలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నగరంలో నిర్వహించిన రేవ్ పార్టీని కూడా పోలీసులు భగ్నం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక ఈ దాడుల్లో భాగంగా రాడిస్సన్ బ్లు హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేయగా.. ఈ దాడుల్లో భాగంగా 150 మందిని అరెస్టు చేశారు. అంతేకాదు పార్టీలో డ్రగ్స్ వాడినట్లు కూడా ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఇక ఇలా పబ్ ఉన్న 150 మందిని అరెస్టు చేయగా ఇందులో బిగ్ బాస్ ఫేమ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం అందుతుంది.
ఇక రాహుల్ సిప్లిగంజ్ తో పాటు మరో ఇద్దరు నటులు కూడా ఉన్నారట. ఇక వారి పేర్లు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కాగా పబ్ కు అనుమతించిన సమయం కంటే ఎక్కువ సమయం నిర్వహిస్తూ ఉండడంతో ఇక ఈ దాడులు నిర్వహించారు.. ఇక ఇలా పబ్ లో ఉన్న 150 మందిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు పోలీసులు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోగా.. ఇక ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..