ప్రభాస్ అభిమానులు ఆ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు..!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా ఇప్పుడు వరుస సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకులను భారీస్థాయిలో నిరాశపరిచిన డార్లింగ్ ఇప్పుడు రాబోయే చిత్రాలతో వారిని శాంత పరచాలని మెప్పించాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే అది పురుష్ స్పిరిట్ ప్రాజెక్ట్ కే సలార్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతో అలరించే విధంగా సిద్ధమవుతుండగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే ప్రభాస్ సినిమాకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో ఆ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ ప్రాజెక్టును ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే కొరటాల శివ తో ప్రభాస్ సినిమా చేయనున్నాడని వార్త ఇప్పుడు బయటకు వస్తుంది. కొరటాల శివ ను దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత ప్రభాస్ దే.  ఆయనతో కలిసి మిర్చి సినిమా చేసిన కొరటాల శివ ఈ తొలి సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకొని ఆ తర్వాత అగ్ర హీరోలతో సినిమాలు చేసి అగ్ర దర్శకుడి గా ఎదిగాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అందరు నమ్మకం పెట్టుకుని సినిమా చేసే దర్శకుడు కొరటాల శివ. అలా ప్రభాస్ కు తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందించి ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాడు.

అయితే ప్రభాస్ తో మరో సినిమా చేయాలని కోరిక అందరిలో నెలకొన్న కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా కూడా ప్రభాస్ దొరకకపోవడం ఈ కాంబో సెట్ కాకపోవడానికి కారణం. ఈ నేపథ్యంలోనే ఇటీవల వీరిద్దరు భేటీ అయ్యారని స్టోరీ గురించి కూడా డిస్కషన్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. కొరటాల చెప్పిన లైన్ నచ్చడంతో ప్రభాస్ పూర్తి కథ రెడీ చేయమని చెప్పాడట. కొరటాల శివతో మరో సినిమా చేయడానికి ఆయన ఎంతో ఉత్సాహంతో ఉన్నారట. ఇప్పుడు వారికి ఉన్న కమిట్మెంట్ లను పూర్తి చేసుకొని త్వరలోనే ఈ సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఇప్పటి నుంచి ప్రేక్షకులు ఎదురు చూడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లిన ప్రభాస్ తిరిగి రాగానే మారుతి దర్శకత్వంలో రెండు నెలల్లో పూర్తి చేసి మిగతా సినిమాలను వచ్చే ఏడాదికల్లా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆయన సినిమా మొదలు పెట్టనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: