మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం చివరి దశ చిత్రీకరణలో ఉంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ అలాగే జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కంటే భారీగా ఖర్చు పెరిగిపోవడంతో నిర్మాతలలో కొంత టెన్షన్ పెరిగిపోయింది. అయితే ఓవర్ బడ్జెట్ ను బట్టి మహేష్ చిత్రాల్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుందని చెప్పవచ్చు. ఆ విధంగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ వసూళ్లను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యొక్క బడ్జెట్ పెరిగిన మాట వాస్తవమే అయినా మహేష్ కున్న ఇమేజ్ తప్పకుండా మంచి లాభాలను తెచ్చి పెడుతుంది అని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ ని భారీ మొత్తానికి అమ్మి నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. పెరిగిన బడ్జెట్ కు అనుగుణంగా ఈ హక్కులు భారీ స్థాయిలో అమ్ముడు పోవడంతో వారు ఎంతో హ్యాపీగా ఉన్నారట. తప్పకుండా మహేష్ క్రేజ్ దృష్ట్యా భారీ వసూళ్లు సాధించవచ్చు అని వారు భావిస్తున్నారు.
అంతేకాకుండా ఈ ప్రాజెక్టు యొక్క అవుట్ పుట్ చూసిన తర్వాత తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని వారు చెబుతున్నారు. ఈ సినిమాలోని కొన్ని కీలక ఘట్టాలు విదేశాలలో చిత్రీకరించడమే ఈ సినిమా బడ్జెట్ పెరగడానికి కారణం అని తెలుస్తుంది. ఏదేమైనా మహేష్ పై ఇంత ఖర్చు పెట్టడం వృధా కాదు అనేది అభిమానుల నుంచి వస్తున్న మరొక మాట. ఇక ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సినిమాపై క్రేజ్ అమాంతం పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం అందరినీ అలరిస్తూ ఉండడం తో మహేష్ ఫ్యాన్స్ చిత్రాన్ని తప్పకుండా విజయవంతం చేస్తామని మాట ఇస్తున్నారు. మే 12వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుంది.