రామరాజు నుంచి గురుస్వామిగా మారిన చరణ్!

Purushottham Vinay
టాలీవుడ్ ఆల్ టైం లెజెండరి సూపర్ హీరోస్ మంచి మాస్ బేస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరోస్ సూపర్ స్టార్ కృష్ణ ఇంకా అలాగే నట సార్వభౌమ ఎన్టీఆర్ లాంటి లెజెండరీ నటుల తర్వాత చిన్న వయసులోనే అల్లూరి పాత్రలో నటించే అరుదైన అవకాశం చరణ్ కి రావడం నిజంగా లక్కీ అని చెప్పాలి. అదీ వివిధ భాషల్లో ఆ పాత్ర పేరు తీసుకురావడం అన్నది కొన్నాళ్ల పాటు గుర్తిండిపోయే అంశం అని చెప్పాలి. రామ్ చరణ్ ఇప్పుడు అదే మూవ్ మెంట్ ని తెగ ఆస్వాదిస్తున్నాడు.సరిగ్గా ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయి 10 రోజులు గడుస్తుంది. వసూళ్ల పరంగా `ఆర్ ఆర్ ఆర్` సినిమా బాక్సాఫీస్ నే షేక్ చేస్తుంది. దీంతో టీమ్ అంతా కూడా చాలా హ్యాపీగా వున్నారు. ఇప్పుడా సంతోషాన్ని రామ్ చరణ్ దేవుడితో పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సడెన్ గా ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప సేవలో మునిగిపోయినట్లు సమాచారం తెలుస్తోంది.నేడు ముంబై ప్రయివేట్ ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ అయ్యప్ప దుస్తుల్లో కనిపించారు.

ముంబైలో ల్యాండ్ అవ్వగానే కారు దిగి నలుపు దుస్తుల్లో ఆయన కనిపించారు. ఆయన కాళ్లకి చెప్పులు లేకుండా నేలపై నడవడాన్ని గమనించవచ్చు. అలాగే చేతికి నలుపు రంగు వాచ్ ని ఆయన ధరించారు. ఈ ఏడాదితో రామ్ చరణ్ గురుస్వామి అయినట్లు తెలుస్తోంది.అలాగే భుజాన గురుస్వామి కండువా ధరించారు. దీంతో రామ్ చరణ్ గురు స్వామిగా ప్రమోట్ అయినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రతీ ఏడాది అయ్యప్ప మాల ధరిస్తుంటారు. 41 రోజుల పాటు భక్తి శ్రద్దలతో ఇంకా అలాగే నియమ నిష్టలతో ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. అలా అయ్యప్పతో రామ్ చరణ్ కి ప్రత్యేకమైన బంధం ఏర్పడింది.ఇక సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా కాని ఏడాదిలో 40 రోజులు అయ్యప్ప భక్తి కోసం కేటాయించడం విశేషం. ఈ అలవాటు రామ్ చరణ్ కి తండ్రి చిరంజీవి నుంచి వచ్చిందని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి కూడా వీలు కుదిరిప్పుడల్లా అయ్యప్ప మాల ధరిస్తారు. తండ్రి కారణంగానే రామ్ చరణ్ కి అయ్యప్ప మాల ధరించడం అలవాటైంది. ఇక ఈ 40 రోజుల పాటు రామ్ చరణ్ ఎలాంటి సినిమా షూటింగ్ ల్లో పాల్గొనే అవకాశం లేదని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: