`ఫిదా`
బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా తన క్రేజ్ పెంచుకుంటూ దూసుకుపోతుంది.భానుమతి సింగిల్ పీస్ అంటూ తెలుగు నాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా
సాయి పల్లవి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రైతు కూలిగా మారిపోయింది.మిగతా రైతు కూలీలతో కలిసి పంట కోత పనుల్లో నిమగ్నమైంది. వాటికి సంబంధించిన ఫోటోల్ని తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది. వాటిని చూసి అభిమానలు
సాయి పల్లవి పై ప్రశంసల వర్షం కురిపించారు. ``సాయి పల్లవి నీలా ఎవరు ఉండలేరని`` మరో
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాద్ పోస్ట్ చేసింది. నీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ సాయి పల్లవి. నువ్వు పెద్ద
హీరోయిన్ అయినా కాని సాధారణ రోజు వారి కూలీలతో కలిసి వాళ్ల జీవిన విధానంలోకి వెళ్లడం అంటే చిన్న విషయం కాదు.ఎంతో పెద్ద మనసు ఉంటే తప్ప అసలు అలాంటి ఆలోచనలు రావు. డౌన్ టూ ఎర్త్ అనే మాటలు వింటూ వింటాం. ఇప్పుడు నీ రూపంలో అవి చూస్తున్నాం అంటూ నెటి జనులు ఆమె పోస్టు పై కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇంతకీ
సాయి పల్లవి రైతు కూలీగా మారిన ఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే? తమిళనాడులోనని సమాచారం తెలుస్తోంది. అక్కడి మహిళా కూలీలతో కలిసి
సాయి పల్లవి ఇలా ఫోటోలు దిగింది. వాటిని తన ఇన్ స్టాలో షేర్ చేసి అభిమానులకు మరింత దగ్గరైంది.ఇక
సాయి పల్లవి సక్సెస్ ఫుల్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో వరుస విజయాలతో సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతుంది. ఇటీవలే `లవ్ స్టోరీ` సినిమాతో మరో
సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. త్వరలో `విరాట పర్వం` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో
సాయి పల్లవి సాహసోపేతమైన పాత్రలో నటిస్తుంది.
హీరో రానాకి కి జోడీగా సాయిల పల్లవి కనిపించనుంది. ఈ సినిమాకి వేణు ఉడుగల దర్శకత్వం వహిస్తున్నారు.