రకుల్ ఎప్పటికీ అభిమానించేది.. అతడినేనట..!!

Divya
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అభిమానులకు సినీ తారలకు మధ్య దూరం బాగా దగ్గరయ్యారని చెప్పవచ్చు.. గతంలో అయితే కేవలం పేపర్లలో చూసుకొని సినీ తారలను మురిసిపోయేవారు కానీ ప్రస్తుతం ఇప్పుడు తమ అభిమానులతో మాట్లాడే అవకాశాలు కూడా వచ్చేసాయి. తమ ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు అడుగుతూ వాటికి భిన్నమైన ఆన్సర్లు తెలియజేస్తూ ఫ్యాన్స్ను కృషి చేస్తూ ఉన్నారు మన నటీనటులు.
ఇక ఇలాంటి సమయంలోనే తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కూడా తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలను కూడా తెలియజేసింది. ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఒక అభిమాని తనని ఇలా అడిగారట.. మీరు ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏమిటి అని అడగగా.. రకుల్ అందుకు సమాధానంగా మీ అందరి ప్రేమ వల్లే ఇలా ఉన్నానని తెలియజేసిందట. ఇక రకుల్ ప్రీతిసింగ్ ఇంట్లో చేసే వంటకాలు ఎక్కువగా బుజిస్తూ ఉంటుందట. ఇక ఆ తర్వాత తెలుగులో మీరు అభిమానించే హీరో ఎవరు అని ప్రశ్న ఎదురుగా.. అందుకు సమాధానంగా అల్లు అర్జున్ అని తెలియజేసింది రకుల్.
ఇక ఆ తర్వాత rrr చిత్రం గురించి మాట్లాడమని తెలుపగా.. ఈ సినిమా గురించి చెప్పడానికి తన దగ్గర మాటలు లేవని ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా నటించారని తెలియజేసింది. DDLJ వంటి ఎప్పటికీ గుర్తుండిపోయే ఎలా ఒక అందమైన ప్రేమకథా చిత్రంలో నటించాలని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలియజేసింది రకుల్ ప్రీతిసింగ్. ఇక ఇదంతా యిలా వుండగా ప్రస్తుతం బాలీవుడ్లో ఎటాక్ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ చిత్రంలో ఈమెకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం 31 అక్టోబర్ లేడీస్ నైట్ అని ఒక చిత్రంలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: