ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ ఆర్ ఆర్
మూవీ మేనియా స్పష్టంగా కనబడుతుంది, విడుదలకు ముందు నుండే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతదేశ ప్రేక్షకులు అందరూ మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకులు ఈ సినిమాపై అంతలా అంచనాలు పెట్టుకోడానికి ప్రధాన కారణం, బాహుబలి లాంటి
బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దర్శకధీరుడు
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న
సినిమా కావడం, మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ లు మొట్ట మొదటి సారి ఒకే సినిమాలో కలిసి నటించడం, ఇలా అనేక కారణాల వల్ల ఆర్ ఆర్ ఆర్ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఆర్ ఆర్ ఆర్
సినిమా థియేటర్ లలో విడుదల అయ్యింది, థియేటర్ లలో విడుదలైన మొదటి రోజు నుండి అదిరిపోయే టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్
మూవీ అదిరిపోయే కలెక్షన్ లను సాధిస్తూ కొత్త కొత్త రికార్డ్ లను
బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు చేస్తోంది. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్
సినిమా ఇప్పటికే నైజాం లో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది, తాజాగా ఆర్ ఆర్ ఆర్
సినిమా పదవ రోజు నైజాంలో 6.
96 కోట్ల షేర్ ను వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 10 రోజులకు గాను నైజాం ఏరియాలో ఆర్ ఆర్ ఆర్
మూవీ 96. 99 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది, ఇలా నైజాం ఏరియాలో ఆర్ ఆర్ ఆర్
సినిమా కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్
సినిమా నైజాం ఏరియాలో 70 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్నట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్
సినిమా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని లాభాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.