చిరంజీవి సినిమాల్లో వరుసపెట్టి అవకాశాలు దక్కించుకుంటున్న అనసూయ..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే,సి ఇది ఇలా ఉంటే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా షూటింగ్  పూర్తి అయ్యి ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.  ఈ సినిమాకు  టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న కొరటాల శివ దర్శకత్వం వహించాడు,  ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు,  పూజా హెగ్డే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కథానాయికగా నటిస్తోంది.  ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమాలో యాంకర్ అనసూయ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది,  ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది అని ఒక టాక్ నడుస్తుంది.

 ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మాత్రమే కాకుండా  గాడ్ ఫాదర్ , భోళా శంకర్ సినిమాలలో కూడా అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది,  మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తోంది,  ఈ సినిమాలో కీర్తి సురేష్  చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది.  ఇలా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య , గాడ్ ఫాదర్ ,  భోళా శంకర్  సినిమాల లోనూ అనసూయ కీలకమైన పాత్ర లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, ఇలా చిరంజీవి సినిమా లలో అనసూయ వరుస పెట్టి అవకాశాలు దక్కించుకుంటుంది,  ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవితో కలిసి ఒక అనసూయ ఒక యాడ్ ఫిల్మ్ లోను నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: