ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను ఎవరు అతిక్రమించిన వారిపై సీరియస్ యాక్షన్ లను తీసుకుంటున్నారు.ఇక రూల్స్ బ్రేక్ చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే మొన్నటికి మొన్న ఎన్టీఆర్ కారు ఆపి ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చారు పోలీసులు.ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ కారు ఆపడమే కాగా ఆ కారుకు జరిమానా కూడా విధించినట్టు తెలుస్తోంది. ఇకపోతే అదే రోజు కళ్యాణ్ రామ్ కారు బ్లాక్ ఫిల్మ్ కూడా తొలగించినట్టు తెలుస్తుంది.ఇదిలా ఉంటె ఇక ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేరారు. అయితే త్రివిక్రమ్ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించిన జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా కూడా విధించినట్టు తెలుస్తుంది.
ఇకపోతే ట్రాఫిక్ పోలీసులు గత కొద్ది రోజులుగా నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇక ప్రతీ ఒక్కరు ఆర్టీఏ జారీ చేసిన నంబర్ ప్లేట్‌ను బిగించాలి.అంతేకాదు తెల్ల ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ రాయించాలి.ఇకపోతే నిబంధనలకు లోబడిన సైజ్‌లోనే నంబర్ ప్లేట్, అంకెలు ఉండాలి.ఫ్యాన్సీ, ఫైబర్, ప్లాస్టిక్ అక్షరాలు నిషేధం.అంతేకాకుండా బైక్, కార్లపై పేర్లు, బొమ్మలు, ఆర్ట్స్ వేయడానికి వీల్లేదు. అయితే కారు అద్దాలకు నల్ల ఫిల్మ్ వాడకూడదు. వాడితే కనీసం 70 శాతం వెలుతురు లోపలికి వచ్చేలా ఉండాలి.వీటితోపాటు అలాంటి విండ్ షీల్డ్ ఉపయోగించాలి.ఇక ఈవిషయంలో ఎంతటి సెలబ్రిటీలు అయినా సరే చర్యలు తప్పనిసరి అంటున్నారు పోలీసులు.
ఇకపోతే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లోనే మంచి డిమాండ్ ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కాగా ఆయన కంటే తక్కువ రేంజ్ దర్శకులు కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే కానీ త్రివిక్రమ్ మాత్రం తెలుగులోనే సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక అల వైకుంఠపురం లో సినిమా అనంతరం వెంటనే మరొక సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు ఈయన. అయితే కరోనా పరిస్థితులు ఆలాగే మహేష్ బాబు బిజీగా ఉండడం వలన సెట్స్ పైకి వెళ్లలేకపోయారు.ఇకపోతే వీరి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ఇది.ఇది ఎలా ఉంటుంది అనే విషయంలో దర్శకుడు ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు...!!