టాలీవుడ్ యంగ్
హీరో రాజ్ తరుణ్ కి కేవలం నాలుగే నాలుగు హిట్లు తప్ప తన కెరీర్ లో అన్ని ఫ్లోపులే వున్నాయి.ఇక ఈసారి ఎలాగైన మంచి హిట్ కోసం
టాలీవుడ్ స్టార్ సీనియర్ స్టార్
హీరో రాజశేఖర్ కూతురు
శివాని రాజశేఖర్ తో పెళ్లికి సిద్ధమయ్యాడు
రాజ్ తరుణ్. అయితే రియల్
పెళ్లి కాదండోయ్.. అది కేవలం రీల్
పెళ్లి మాత్రమే. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమడ
మీడియా ఇంకా అలాగే జీ5 సంయుక్తంగా నిర్మించబోయే ఓ వెబ్ సీరీస్ లో భాగంగా
టాలీవుడ్ యంగ్
హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించబోతున్నాడు. పాత
బ్లాక్ బస్టర్ సినిమా `ఆహ నా పెళ్ళంట` టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సిరీస్ కి
సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించబోతుండగా..
రాహుల్ తమడ ఇంకా అలాగే సాయిదీప్
రెడ్డి బుర్ర నిర్మాతలుగా ఉన్నారు. ఇక తాజాగా
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సిరీస్ లో
హీరో రాజ్ తరుణ్ సరసన
శివాని రాజశేఖర్
హీరోయిన్ గా నటించబోతోంది.
వీరిద్దరి
లవ్ ట్రాక్ పెద్ద హైలైట్గా నిలుస్తుందని సమాచారం తెలుస్తుంది.అలాగే సీనియర్ నటి నటులు ఆమని, హర్షవర్ధన్,పోసాని కృష్ణమురళి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరి ఈ సిరీస్ తో అయినా
రాజ్ తరుణ్ హిట్ కొట్టి మళ్ళీ
సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో..? లేదో..? అనేది చూడాలి. కాగా
శివాని రాజశేఖర్ విషయానికి వస్తే.. ఈ
బ్యూటీ `అద్భుతం` సినిమాతో
టాలీవుడ్ లో
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2021లో ఓటీటీ వేదికగా రిలీజైన ఈ
సినిమా మంచి విషయం సాధించింది. ప్రస్తుతం ఈమె తన
తండ్రి రాజశేఖర్ తో కలిసి `శేఖర్` అనే మూవీలో నటిస్తోంది. అలాగే తమిళంలో రెండు సినిమాలకు కూడా
శివాని రాజశేఖర్ సైన్ చేసింది. ఇలా తక్కువ టైం లోనే
శివాని వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. మరి హిట్స్ కొట్టి
టాలీవుడ్ లో స్టార్
హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందో లేదో అనేది చూడాలి.