RRR: చిన్నారి పాడిన పాటకు ఫిదా అయిన కీరవాణి..!

N.ANJI

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాయి. బహుబలి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. ప్రస్తుతం విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఎంతో ఘన విజయం సాధించింది. భారీ వసూళ్లు కొల్లగొడుతూ దూసుకెళ్తోంది.


టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాల్లో ఎన్ని అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. అలాగే రామ్ చరణ్ పోలీస్ పాత్ర ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. వీరి నటనతో ప్రేక్షకులను తమ వైపు తిప్పుకున్నారు.


ఆర్ఆర్ఆర్ మేకింగ్‌లో దర్శకుడు రాజమౌళి ఎంతో ఆచితూచి వ్యవహరించారు. విజువల్స్ కూడా ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. అలాగే ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీతం. ఈ సినిమాలో సంగీత దర్శకుడు కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు ఆల్ టైం సూపర్ హిట్‌గా నిలిచాయి. అలాగే సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా స్థాయిని పెంచాయి.



ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభంలోనే ఒక చిన్న పాప పాటతో ప్రారంభం అవుతుంది. ‘కొమ్మ ఉయ్యాల... కోనా జంపాల’ అనే పాట మీకు గుర్తుకు ఉండే ఉంటుంది. ఓ చిన్నారి బ్రిటీష్ రాణికి పచ్చబొట్టు వేస్తున్నప్పుడు ఈ పాటను పాడుతుంది. ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ పాటను పాడిన చిన్నారిని కీరవాణి ట్విట్టర్ వేదికగా పరిచయం చేశారు. ఈ పాటను పాడిన చిన్నారి పేరు ప్రకృతి. 2019 మార్చి 15వ తేదీన ఈ పాటను రికార్డ్ చేశారు కీరవాణి. అప్పుడు ఆ చిన్నారి వయసు కేవలం మూడేళ్లు మాత్రమే. ఈ పాటను పాడిన చిన్నారిపై కీరవాణి ప్రశంసల వర్షం కురిపించారు. తను ఎంతో టాలెంట్ కిడ్ అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: