షేక్ చేస్తున్న ఆచార్య మ్యానియా !
‘ఆచార్య’ విడుదల ఈ నెలాఖరులో ఉన్నప్పటికీ ఈసినిమా మ్యానియా అప్పుడే ప్రారంభం అయిపోయింది. ‘ఆర్ ఆర్ ఆర్’ కు వచ్చిన భారీ కలక్షన్స్ స్ఫూర్తితో ‘ఆచార్య’ ను తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్లు మరొక మాట చెప్పకుండా ఎటువంటి బేరసారాలు ఆడకుండా నిర్మాతలు చెప్పిన రేట్లకు కొనుక్కున్నారు అని వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ముందు ‘ఆర్ ఆర్ ఆర్’ బయ్యర్లు ఈమూవీ నిర్మాతలతో తమకు కొంత ఈమూవీ రేటు విషయంలో డిస్కౌంట్ లు ఇమ్మని బేరసారాలు అడిగినట్లు టాక్. అయితే ప్రభంజనం లా వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ కలక్షన్స్ చూసి ఆస్థాయిలో కాకపోయినా భారీ స్థాయిలో ఈమూవీని కూడ కలక్షన్స్ వస్తాయని బయ్యర్లు భావించడంతో ‘ఆచార్య’ ఆమూవీ నిర్మాతలు చెప్పిన రేట్లకే కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలాఉండగా ఈమూవీలో చిరంజీవి రామ్ చరణ్ లు కలిసి నటించడంతో అది ప్లస్ పాయింట్ గా మారడంతో ఈమూవీ ప్రమోషన్ ను అత్యంత భారీ స్థాయిలో చేసే విధంగా ఈమూవీ నిర్మాతల ఆలోచనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియంలో ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రియల్ 20వ తారీఖు ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆఫంక్షన్ కు అనేకమంది రాజకీయ ప్రముఖులతో పాటు పవన్ కళ్యాణ్ ను కూడ పిలవాలని దర్శక నిర్మాతల ఆలోచన అని అంటున్నారు.
ఒకే వేదిక పై చిరంజీవి పవన్ రామ్ చరణ్ లను చూస్తే అది మెగా అభిమానులకు కాకుండా సగటు ప్రేక్షకులకు కూడ అది పండుగలా ఉంటుంది కాబట్టి ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ స్థాయిలో హైప్ వచ్చే ఆస్కారం ఉంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ స్థాయిలో తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ‘ఆచార్య మ్యానియా కనిపించే విధంగా అత్యధిక ధియేటర్లలో ‘ఆచార్య’ విడుదలకు ప్లాన్ జరిగింది అని అంటున్నారు. ఈమ్యానియా మరింత కొనసాగించడానికి టివి ఛానల్స్ లో చిరంజీవి చరణ్ లు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తూ ఈమూవీ మ్యానియాను సగటు ప్రేక్షకుడులో మరింత పెంచబోతున్నారు..