రణబీర్, ఆలియా వెడ్డింగ్ డేట్ లాక్.. పెళ్లి వేదిక ఇదే..!

Anilkumar
రన్బీర్ కపూర్ మరియు ఆలియాభట్ ప్రేమ విషయం మనందరికీ తెలిసిందే అయితే వీరిద్దరూ కలిసి  సైలంట్ గా పని కానిచ్చేయాలనుకుంటున్నారు. అయితే కత్రినా-విక్కీ కౌశల్ జంటను ఆదర్శంగా తీసుకుని అసలేం జరగడం లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు.ఇక  ఓ పక్క ఈ నెలలో ముహూర్తానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు ముంబైలో నుండి సమాచారం వినిపిస్తోంది. ఇకపోతే డెస్టినేషన్ వెడ్డింగ్ కి వేదికను కూడా ఫిక్స్ చేసుకున్నారు ఈ లవ్లీ కపుల్.అయితే రణ్ బీర్ – అలియాల పెళ్లి… 2020 డిసెంబర్‌లో  జరగాల్సి ఉంది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇకపోతే అప్పుడో ఇప్పుడో అంటోన్న అసలైన పెళ్లి డేట్ మాత్రం ముందుకు పడటం లేదు.

అయితే ఇక ఈ ఏప్రిల్‌ లోనే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి బంధంతో ఒక్కటవుతారని ప్రస్తుతం  జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే విక్కీ కౌశల్‌ – కత్రినా కైఫ్‌ జంటలా వీరు కూడా పెళ్లి విషయంలో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటికే వెడ్డింగ్ డేట్ లాక్ చేసుకున్న హీరోయిన్ అలియా – రణ్ బీర్… హై క్లాస్ డెస్టినేషన్ వెడ్డింగ్‌ లా కాకుండా వాళ్ల ఫ్యామిలీ సెంటిమెంట్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ సెలెబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారనేది గాసిప్.ఇకపోతే  ఇక కపూర్ వంశానికి చెందిన తరతరాల నివాసం ఆర్కే హౌస్‌లో రణ్‌బీర్‌ మరియు ఆలియా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయనేది ముంబై సమాచారం.

అయితే  అక్కడే అతికొద్ది మంది సన్నిహితుల నడుమ అతిత్వరలో రణ్ బీర్ ఇంకా అలియా విహాహం జరగనున్నట్టు ప్రస్తుతం సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే... ఇటీవలే బాలీవుడ్లో 'గంగుబాయ్ కతీయవాడి' సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది ఆలియాభట్. ఇక తాజాగా త్రిబుల్ ఆర్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు రణబీర్ కపూర్ ఆలియా భట్ తో కలిసి 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నాడు. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా పార్ట్ వన్ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్నట్టు ఈ సినిమాలో మన టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: