అల్లూరి గా మారిన యంగ్ హీరో.. ఈసారి పోలీస్ పాత్రలో..?

Anilkumar
శ్రీవిష్ణు కి విభిన్న క్యారెక్టర్లకు పెట్టింది పేరు.అయితే మొదటి  నుంచీ ఈ యంగ్ హీరో సక్సెస్ ఫెయిల్యూర్స్ తోసంబంధం లేకుండా సినిమాలుచేస్తున్నాడు.ఇకపోతే ఫస్ట్ నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలతో.. ఇక కొత్త కొత్త పాత్రలతో సినిమలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇకపోతే తనని తాను తెరపై కొత్తగా ఆవిష్కరించుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.ఇదిలావుండగా  తాజాగా ఆయన మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. కాగా ఈ సినిమాకి అల్లూరి అనే టైటిల్ ను ఖరారు చేసి, ప్రీ లుక్ పోస్టర్ ను వదిలారు.అయితే బెక్కెం వేణుగోపాల్ తో సంయుక్తంగా బబిత నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఇది ఒక సిన్సియర్ ఆఫీసర్ చుట్టూ నడిచే కథ ఇది.కాగా  పోలీస్ ఆఫీసర్ పాత్రలో యంగ్ స్టార్ గా శ్రీవిష్ణు కనిపించనున్నాడు. అయితే ఇప్పటి వరకూ తాను చేస్తున్న సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఇకపోతే హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.ఇక బ్రోచేవారెవరురా తరువాత శ్రీ విష్ణు కెరీర్ లో పెద్దగా సూపర్ హిట్ లేదు.అయితే  ఈ సినిమా తరువాత యంగ్ స్టార్ దూకుడు చూపిస్తాడని అనుకుంటే..తిప్పరా మీసం .. గాలి సంపత్ లాంటి సినిమాలతో వరుసగా ఫెయిల్యూర్స్ ను అందుకున్నాడు హీరో. ఇకపోతే ఆ తరువాత రాజ రాజ చోర సినిమాతో పర్వాలేదనిపించేకున్నాడు శ్రీవిష్ణు.

అయితే  కాని రీసెంట్ గా రిలీజ్ అయిన అర్జున ఫల్గుణ మళ్లీ దెబ్బకొట్టేసింది.ఇదిలావుండగా ప్రస్తుతం భళా తందనాన సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉన్నాడు శ్రీవిష్ణు. అయితే ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇకపోతే ఒక వేళ ఈ సినిమా ప్రభావం చూపించకపోయినా.. అల్లూరి సినిమాతో అయినా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. మరి ఇప్పటి వరకు ఎన్నో విభిన్న తరహా పాత్రలు పోషించిన శ్రీ విష్ణు కెరీర్లో మొదటిసారి పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకొని శ్రీ విష్ణు ఈ సినిమాతో సక్సెస్ కొడతాడేమో  చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: