మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు 'గని' 'ఎఫ్ 3' లాంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గని' సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది.కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ వహించిన ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలను పోషించారు. బాక్సింగ్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 8 వ తేదీ న విడుదల కాబోతోంది.ఇక ఇదిలా ఉంటే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొన్నీమధ్య ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా వారం రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా అలరించబోతోంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అందుకుంటున్న రెమ్యునరేషన్ అయితే అందరినీ కూడా షాకింగ్ కి గురి చేస్తూ ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది.ఇంతకు ముందు ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల మేర పారితోషికం అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రవీణ్ సత్తారు సినిమాకి మాత్రం ఏకంగా రూ. 12 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడట. వరుస హిట్ లతో దూసుకుపోతుండటంతో.. మేకర్స్ కూడా ఆయన ఆడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఓకే చెప్పారని జోరుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.ఇక ఇదే కనుక నిజమైతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్లో ఇప్పటి దాకా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న మూవీ ఈ మూవీనే అవుతుంది. కాగా ఇదో వైవిధ్యమైన ప్రేమకథా సినిమా అని ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం తెలుస్తుంది.