గ్లోబల్
బ్యూటీ అయిన
ప్రియాంక చోప్రాకి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ కి తగ్గట్టుగానే ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది
అయితే, తాజాగా
ప్రియాంక ఒక ఆసక్తికర ఫోటోను పోస్ట్ చేసింది. లాస్ ఏంజెల్స్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' మ్యాన్‌హోల్ కవర్ ను చూసిందట
ప్రియాంక చోప్రా. పైగా తన మేనకోడలు కృష్ణతో కలిసి 'మేడ్ ఇన్ ఇండియా' మ్యాన్‌హోల్ కవర్ ముందు ఒక ఫోటో దిగి.. ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందట.
'మేడ్ ఇన్ ఇండియా' మ్యాన్‌హోల్ కవర్లు 1980ల చివరలో మరియు 1990లలో యూఎస్ లో అందుబాటులోకి వచ్చాయని తెలుస్తుంది.. భారతదేశంలోని ఫౌండ్రీలలో తయారు చేసిన తర్వాత ఈ కవర్లు యూఎస్ కి ఎగుమతి కూడా చేయబడ్డాయి. మొత్తానికి 'మేడ్ ఇన్ ఇండియా' మ్యాన్‌హోల్ కవర్ తో
ప్రియాంక చోప్రా మరోసారి వార్తల్లో నిలిచిందట.. ప్రస్తుతం ఈ గ్లోబల్
బ్యూటీ హాలీవుడ్ లో వరుస ఆఫర్లతో మంచి జోరు చూపిస్తోంది.
ప్రియాంక చోప్రా ఇటీవలే ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్తో అందరిని అలరించింది. ప్రస్తుతానికి ఈ గ్లోబల్
బ్యూటీ 'సిటాడెల్' అనే
అమెజాన్ సిరీస్ తో బాగా బిజీగా ఉంది. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ కూడా అందుకున్నట్లు తెలిసింది. ప్రముఖ
హాలీవుడ్ నటుడు ఆంథోనీ మాకీతో కలిసి ఎండింగ్ థింగ్స్ లో నటించనుందట..
జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన యాక్షన్
కామెడీ సినిమా 'ట్రూ లైస్' తరహాలో ఈ
సినిమా ఉండనుందని తెలుస్తుంది.
మొత్తానికి ప్రియాంకకు మరో క్రేజీ ఆఫర్ అంటూ టుడే మొత్తం
ప్రియాంక పేరే వైరల్ అవుతుందట.. అన్నట్టు 'ప్రియాంక చోప్రా' ఇన్ స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల విషయంలో కూడా అందరి కంటే టాప్ లో నిలిచిన విషయం తెలిసిందే.
ప్రియాంక తన ఇన్‌స్టాలో 72.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ కలిగి ఉందట..
ఇండియన్ స్టార్ల లిస్ట్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగి ఉన్న ఏకైక స్టార్ కూడా
ప్రియాంక చోప్రానే కావడం గమనార్హం.
అయితే, నేటి ఆమె విజయం వెనుక ఎన్నో కష్ట నష్టాలు ఉన్నాయి గ్లోబల్
బ్యూటీ అంటూ నేడు
ప్రియాంక చోప్రాకు విపరీతమైన స్టార్ డమ్ వచ్చి ఉండొచ్చు. కానీ.. ఆమె కెరీర్ అంతా కూడా కన్నీళ్లతో అవమానాలతోనే మొదలైంది. 16 ఏళ్ల వయసులోనే
ప్రియాంక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడిందట.ఈ విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పేసింది.. డస్కీ
బ్యూటీ అంటూ తన మనసును చాలా సార్లు గాయపరిచారని ఆమె పబ్లిక్ గా చెప్పి ఎంతో బాధ పడింది.