తమిళనాడులో కొనసాగుతున్న ఆర్ఆర్ఆర్ పరంపర.. కళ్ళు చెదిరే ప్రాఫిట్..!!

Divya
ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం మరే సినిమా కూడా విడుదల కాని నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఏ థియేటర్లో చూసినా ఈ సినిమా పరంపర కొనసాగుతోంది.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రతీ పాత్రను కూడా పూర్తిస్థాయిలో చెక్కారు అని చెప్పవచ్చు. తన అభిరుచికి తగ్గట్టుగా పాత్రలను చెక్కే జక్కన్న.. బాలీవుడ్లో కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. మొదట్లో ఈ సినిమాపై ఎన్నో విమర్శలు తలెత్తిన కూడా హీరోలు అలాగే దర్శకుడు ఏమాత్రం బెదరకుండా సినిమా ప్రమోషన్స్ లో పూర్తిస్థాయిలో పాల్గొని అభిమానులకు మరింత దగ్గరయ్యారు. ఊరు వాడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క చోట సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ సినిమా టీం .. వీరి కష్టానికి ప్రతిఫలం దక్కింది అని చెప్పవచ్చు.
ఇక ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ప్రవేశించింది అని ఇప్పటికీ తాము కోరుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలోనే షేర్ రాబట్టింది అని. తాజాగా TN థియేటర్ యజమానుల సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రహ్మణ్యం తాజాగా వెల్లడించారు. తాజాగా ఈయన  మాట్లాడుతూ శుక్రవారం పెద్ద సినిమాలు విడుదల అయ్యే ఆస్కారాలు లేవు కాబట్టి ఈ నెల 13వ తేదీన విడుదలయ్యే బీస్ట్ సినిమా వచ్చే వరకు ఆర్ ఆర్ ఆర్ సినిమా పరంపర కొనసాగుతుంది అని తెలిపాడు.
బీస్ట్ సినిమా విడుదల అవ్వడానికి ఇంకా ఏడు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ లోపు మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది అని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక ఈ సినిమా ఏ మాత్రం సందేహం లేకుండా వెయ్యి కోట్ల క్లబ్లో చేరి పోతుంది అని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేయడంతోపాటు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: