ఒకేసారి 2 భాషలలో.. చైతూ కొత్త మూవీ విడుదల..!!
ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ లోకి కూడా అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు . అంతేకాదు ఈ సినిమాను ఒకేసారి రెండు భాషలలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేపడుతున్నాడు నాగచైతన్య. ఇక తమిళ్ , తెలుగు భాషలలో ఒకేసారి తన సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు నాగచైతన్య. ఇకపోతే ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయకపోవడంతో ప్రస్తుతానికి #NC22 టైటిల్ ఖరారు చేశారు. ఇకపోతే ఈ సినిమాని కి తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకట్ ప్రభుతో కలిసి ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ తమిళ్లో రాగా ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ రైట్స్ తో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే తమిళ్ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు ఇప్పటికే ఎంతమంది తమిళ్ స్టార్ హీరోలతో కలిసి పనిచేసి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన నాగచైతన్య కోసం ప్రత్యేకంగా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి ఎట్టకేలకు ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు చిత్రం మేకర్స్. మరి తమిళ్ ఇండస్ట్రీలో తమిళ ప్రేక్షకులు నాగచైతన్యను ఆదరిస్తారో లేదో తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడక తప్పదు.