షాకింగ్ : రోజా భర్త సెల్వమణి పై అరెస్ట్ వారెంట్?
ఇక ఇప్పుడు ఎమ్మెల్యే జబర్దస్త్ జడ్జి రోజా భర్త ఆర్కే సెల్వమణి గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆర్కే సెల్వమణి పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది అంటూ వార్త చక్కర్లు కొడుతోంది. పరువు నష్టం కేసు విచారణకు హాజరు కాకపోవడంతో నే ఇలా అరెస్టు వారెంట్ జారీ అయినట్లు తెలుస్తోంది. చెన్నై జార్జి టౌన్ కోర్టు ఈ వారెంట్ ఇచ్చిందట. ఆర్కే సెల్వమణి దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.
అయితే 2016లో సెల్వమణి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుల్ అన్బరుసు ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఫైనాన్షియర్ ముకుంద చంద్ బొద్రా గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బొద్రా కోర్టులో సెల్వమణి తో పాటు ఎమ్మెల్యే అరుల్ పైన కూడా నష్టం దావా వేశారు. ఇక బొద్రా మరణించిన తర్వాత ఆయన కుమారుడు ఈ కేసును కొనసాగిస్తున్నారు. అయితే కోర్టులో మంగళవారం విచారణకు ఆర్కే సెల్వమణి హాజరుకావాల్సి ఉంది. కానీ కోర్టు ముందు హాజరు కాలేదు. ఆయన తరపు న్యాయవాదులు సైతం రాలేదు. దీంతో న్యాయమూర్తి వారిద్దరిపై అరెస్టు వారంట్ జారీ చేయడం సంచలనంగా మారింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.