రంగంలోకి దిగిన దేవిశ్రీ ప్రసాద్.. ఇక డబిది దిబిదే..!!

P.Nishanth Kumar
ేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సృష్టించి అందరి అటెన్షన్ గ్రాఫ్ చేసింది పుష్ప సినిమా. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ రికార్డును నెలకొల్పింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రంలో హీరోగా చేసిన అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ పెరిగిపోయింది. సుకుమార్ ఇమేజ్ కూడా ఎక్కువయింది. ఇటు రష్మిక మందన క్రేజీ కూడా అమాంతం పెరిగిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా చేసింది. ఈ ఒక్క సినిమా ఎంతో మంది జీవితాలను పూర్తిగా మార్చి వేసింది అని చెప్పాలి .

అప్పటిదాకా తెలుగుకు మాత్రమే పరిమితమై ఉన్న వీరి టాలెంట్ ఈ సినిమా విడుదల తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ నీ దక్కించుకుంది. మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం tho ఈ సినిమా యొక్క రెండవ భాగంgaa వచ్చే సినిమాపై పాటలకు కూడా అంతే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తొలి పాటకు అదిరిపోయే పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని కూడా అందించి దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

పుష్ప రెండవ భాగం ఈ సినిమాకు సంబంధించిన సంగీతంపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో రెండవ భాగం సినిమా కూడా ఎంతో కొత్తగా ఉండేలా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క సంగీతం పనులను పూర్తి చేశాడు దేవి శ్రీ ప్రసాద్. ఏకంగా మూడు పాటలను ట్యూన్ చేశాడట. మొదట ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేయలేదు. కానీ దేవి మాత్రం ట్యూన్ లు రెడీ చేసుకున్నారట. మధ్యలో వచ్చాక స్టోరీ డిమాండ్ మేరకు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని ఆలోచన చేయగా దేవిశ్రీప్రసాద్ చేసిన ఈ పాటలు తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తాయని వారు నమ్ముతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: