వెంకీ అట్లూరి కి బర్తడే విషెస్ తెలిపిన మారి..!!

Divya
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నేడు తన మొదటి తెలుగు,  తమిళ్ ద్విభాషా దర్శకుడు వెంకీ అట్లూరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేశాడు. ఇక నేడు తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా ధనుష్ ఇలా ట్వీట్ చేయడం జరిగింది.. నా మొదటి తెలుగు,  తమిళ్ భాషా దర్శకుడు.. డైరెక్టర్ వెంకీ అట్లూరి సర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు . దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ధనుష్ వెల్లడించారు.

ఇకపోతే వెంకీ అట్లూరి తెలుగు సినిమా దర్శకుడు మాత్రమే కాదు నటుడు కూడా . ఆయన మూడు సినిమాలకు దర్శకత్వం వహించడం జరిగింది. ఇక దర్శకుడు,  నటుడు మాత్రమే కాదు మంచి రచయిత కూడా. సినిమాలకు రచయితగా పనిచేశారు. జ్ఞాపకం అనే సినిమా ద్వారా నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత 2010లో వచ్చిన స్నేహగీతం సినిమాకి డైలాగులు ప్రశ్నించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇట్స్ మై లవ్ స్టోరీ కి సంభాషణలు అందించిన వెంకీ అట్లూరి ఆతర్వాత కేరింత సినిమాకి పూర్తి స్థాయిలో రచయితగా పనిచేశారు.

2018లో తొలిప్రేమ సినిమా కి మొదటి సారి దర్శకుడిగా రచయితగా పనిచేశారు. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకున్న అని చెప్పవచ్చు. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2019లో మిస్టర్ మజ్ను అలాగే 2021లో రంగ్ దే సినిమాలకు డైరెక్టర్గా పనిచేశారు. అయితే ఇప్పటివరకు ఈయన బ్లాక్ బస్టర్ విజయాలను అయితే సొంతం చేసుకోలేదు.. కేవలం చిన్నచిన్న హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించటానికి దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమవుతున్నాడు వెంకీ అట్లూరి. నేడు పుట్టినరోజు సందర్భంగా సినిమాల పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: