ప్రముఖ జ్యోతిష్కులలో వేణుస్వామి ఒకరు .అయితే ఈయన సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇదిలావుండగా గతం లో చైసామ్ వైవాహిక జీవితం గురించి వేణుస్వామి కొన్నేళ్ల క్రితం చెప్పిన విషయాలు వాళ్లు విడాకులు తీసుకోవడం వల్ల నిజమని ప్రూవ్ అయ్యాయి.అయితే చైతన్య సమంత విడిపోతారని చెబితే తనను తిట్టారని కానీ అదే నిజం కావడంతో చాలామంది రియలైజ్ అయ్యారని ఆయన చెప్పుకురాడవడం జరిగింది.ఇకపోతే తాను పబ్లిక్ డొమైన్ లో ఉన్నవాళ్ల గురించి మాట్లాడతానని ఆయన కామెంట్లు చేశారు. అంతేకాదు టాలీవుడ్ లోని ఇద్దరు హీరోల సినిమాలు ఆగిపోతాయని..
ఆరోగ్య సమస్యల వల్లే ఇద్దరు హీరోల సినిమాలు ఆగిపోతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే టాలీవుడ్ లో ప్రస్తుతం బాగున్న జాతకం బన్నీ జాతకం అని వేణుస్వామి వెల్లడించారు. ఇక రాబోయే ఐదేళ్ల వరకు బన్నీ జాతకంలో పెద్దగా మార్పు లేదని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కే సినిమాలకు 200 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని ఆయన కామెంట్లు చేశారు.అంతేకాదు ఆయన మహేష్, రానా, తారక్ జాతకం బాగుందని వేణుస్వామి పేర్కొన్నారు.అయితే ఎవరి ప్రభావం లేకుండా అఖిల్ సినిమాలు చేయాలని వేణుస్వామి తెలిపారు. ఇకపోతే అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని వేణుస్వామి వెల్లడించారు.
ఇక హీరోయిన్ సమంత జాతకం బాగుందని వేణుస్వామి వెల్లడించారు. అంతేకాదు సమంతపై నెగిటివిటీ తగ్గుతుందని వేణుస్వామి కామెంట్లు చేశారు.ఇకపోతే రష్మిక, పూజా హెగ్డేల జాతకాలు కూడా కొన్నేళ్ల పాటు అద్భుతంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.అయితే మరి వేణుస్వామి సెలబ్రిటీలకు సంబంధించి చెప్పిన విషయాలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది.ఇక హీరో ప్రభాస్ జాతకం మాత్రం బాలేదని వేణుస్వామి చెప్పడం జరిగింది. అయితే వేణుస్వామి చేసిన కామెంట్లు ప్రభాస్ అభిమానులను బాధ పెడుతున్నాయి. ఇకపోతే కొంతమంది ప్రభాస్ అభిమానులు వేణుస్వామిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండటం గమనార్హం...!!