రష్మిక మందన గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కన్నడ సినిమాల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొన్న రష్మీక మందన, కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో మొదటి విజయాన్ని కన్నడ ఇండస్ట్రీ లో అందుకుంది, కిరీక్ పార్టీ మూవీ తర్వాత రష్మీక మందన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఛలో తో టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అనేక విజయాలను టాలీవుడ్ ఇండస్ట్రీ లో అందుకున్న రష్మిక మందన కొన్ని రోజుల క్రితం విడుదలైన పుష్పా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది, పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న రష్మిక మందన కు ప్రస్తుతం వరుస క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.
అందులో భాగంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఎనిమల్ సినిమాలో రష్మిక మందన ను చిత్ర బృందం హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది, ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కబోతున్న విజయ్ 66 వ సినిమాలో కూడా రష్మిక మందన నే చిత్ర బృందం హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది, ఈ విషయాన్ని తాజాగా రష్మిక మందన పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. మొదటి సారి విజయ్ తెలుగులో నేరుగా నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు, ఇలా రష్మిక మందన ప్రస్తుతం రెండు భారీ క్రేజీ ప్రాజెక్ట్ లలో అవకాశాన్ని దక్కించుకుంది, ఈ సినిమాలు మాత్రమే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా రష్మీక మందన పలు ప్రాజెక్ట్ లకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.