అమ్మ సెంటిమెంట్ తో "కేజిఎఫ్ 2" ఎమోషనల్ సాంగ్ ?

VAMSI
సైలెంట్ గా వచ్చి సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం కేజిఎఫ్ ఏ స్థాయిలో అన్ని వర్గాల అభిమానులను అక్కట్టుకుని ఆదరణ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో ఒక్క సారిగా కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా హీరో  గా మారిపోయారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కి ప్రేక్షకులు దాసోహం అయ్యారు. అయ్యారే భళా అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కలెక్షన్స్ లోనూ ఈ సినిమా తన మార్క్ ను కనబరిచింది. అంచనాలకు మించిన వసూళ్లను రాబట్టి రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ను చూసి ప్రశాంత్ నీల్ సీక్వెల్ ను ప్లాన్ చేశాడు. అలా ఈ వార్త అతని నుండి వచ్చిందో లేదో? అప్పటి నుండి ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్ డేట్ కోసం పడిగాపులు కాస్తున్నారు యశ్ అభిమానులు.
అయితే ఇపుడు కేజీఎఫ్ 2 కి కూడా అంతకు మించిన క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా నుండి మరో పాట విడుదలై యూ ట్యూబ్ లో వైరల్ గా మారి దూసుకుపోతోంది. విడుదలయిన కొన్ని నిముషాలకే సినిమాకి రెట్టింపు క్రేజ్ ను వైఫై లా పెంచేసింది ఈ పాట. అందులోనూ ఇది అమ్మ ప్రేమకు సంబంధించిన పాట కావడంతో శ్రోతలు ఫిదా అవుతున్నారు.
"ఎదగరా  ఎదగరా...... దినకరా....
జగతికే జ్యోతిగా నిలవరా....
పడమర నిశీధిరా... వాలనీ
చరితగా ఘనతగా వెలగరా
అంతులేని గమ్యము కదరా
అంతవరకూ లేదిక నిదురా"
అంటూ సాగే ఈ పాట అందరినీ తన వైపుకు తిప్పుకుంటోంది. 'కె.జి.యఫ్: చాప్టర్ 1'లో అమ్మ పాట అలాగే రోడ్డుపై హీరో కార్ సడెన్ గా ఆపి, ఓ తల్లితో హీరో చెప్పే మాటలు సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఇపుడు ఈ పాట కూడా అదే స్థాయిలో ఆదరణ అందుకుంటుంది అంటున్నారు. ఇక ఈ సీక్వెల్ లోనూ హీరోకి తన తల్లికి మధ్య వచ్చే సన్నివేశాలు బలంగా ఉండనున్నాయి అని అవి సినిమాని మరో స్థాయికి తీసుకెళుతాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: