తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఇక అది ఏంటి అంటే...బాలీవుడ్
బాద్షా షారుఖ్ ఖాన్ తాను
కోలీవుడ్ స్టార్
విజయ్ కు అభిమానిని అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.ఇకపోతే 'బీస్ట్'
హిందీ ట్రైలర్‌ను ఆవిష్కరిస్తూ
దళపతి విజయ్ అభిమానులను షారుఖ్ ఆశ్చర్యానికి గురి చేశాడు.అయితే ఈ చిత్రం ఏప్రిల్ 13న పలు భాషల్లో గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే ఈ
సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ సందర్భంగా షారుఖ్ 'అట్లీతో కలిసి కూర్చున్నాను. ఇకపోతే
విజయ్ కి
అట్లీ ఎంత పెద్ద అభిమానో నేను కూడా అంతే పెద్ద అభిమానిని.
అయితే 'బీస్ట్' టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక ట్రైలర్ స్ట్రాంగ్ గా ఉంది!!' అంటూ ట్వీట్ చేశారు. ఇకపోతే 'బీస్ట్' నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్
థ్రిల్లర్ . కాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రంలో
విజయ్ సరసన
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, సెల్వరాఘవన్, షైన్
టామ్ చాకో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, VTV గణేష్, అపర్ణా దాస్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా
అనిరుధ్ రవిచందర్ 'బీస్ట్'కు మ్యూజిక్ అందించారు. ఇప్పటికే అనిరుద్ ఈ సినిమాకి అందించిన పాటలు భారీ రెస్పాన్స్ ని కనబరిచాయిమ్ ఈ పాటలు
యూట్యూబ్ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి.
అటు మరోవైపు బీస్ట్
సినిమా ట్రైలర్ కూడా విశేష స్పందన కనబరిచింది. తెలుగులో కూడా ఈ చిత్ర ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. కచ్చితంగా
సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. షారుఖ్,
అట్లీ కలిసి 'లయన్' అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఇప్పుడు షారుఖ్ ఖాన్…
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పఠాన్' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇకపోతే 'పఠాన్'ను పూర్తి చేసిన తర్వాత
అట్లీ 'లయన్'ను తిరిగి ప్రారంభించనున్నాడు.అయితే ఇందులో
నయనతార హీరోయిన్ గా నటిస్తోంది...!!