వామ్మో.. 11 ఏళ్ళ వయసులోనే ఆ హీరో ని ప్రేమించిన ఆలియా?

praveen
ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆలియాభట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో ఉన్న  టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతూ ఉన్నారు అలియాభట్.  ఒక వైపు గ్లామర్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించడమే కాదు మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న విభిన్నమైన పాత్రలో కూడా నటించి తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఆలియాభట్ తన సినిమాలతో ఎంతలా హాట్ టాపిక్ గా మారిపోయిందో.. లవ్ స్టోరీ తో కూడా సోషల్ మీడియాలో అంతే సెన్సేషన్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక ఎన్నో రోజుల నుంచి రణవీర్ కపూర్ తో ఆలియాభట్ ప్రేమలో కొనసాగుతోంది. పార్టీలు పబ్బులు అనే తేడా లేకుండా ఇద్దరూ కూడా చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఇక త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక టాక్ కూడా వినిపిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆలియా భట్ రణవీర్ కపూర్ ఇద్దరు చూడ చక్కనైన జంట అంటూ అభిమానులు అంటూ ఉంటారు. అయితే ఆలియాభట్ లవ్ స్టోరీ గురించి ఇక ఇప్పుడు ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో అలియాభట్ ఇప్పుడు కాదు ఏకంగా చిన్నవయసులోనే ప్రేమలో పడిపోయిందట. రణబీర్ కపూర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా బ్లాక్ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇక ఆడిషన్స్ కు ఆలియా భట్ కూడా వెళ్లారట. అప్పుడు ఆమె వయసు పదకొండేళ్లు. ఇక అక్కడే రణబీర్కపూర్ ని చూసిన ఆలియాభట్ మనసు పారేసుకున్నారట. అప్పటి నుంచి అతని పై అమితమైన ప్రేమను పెంచుతుందట. ఈ క్రమంలోనే ఇక రణబీర్ కపూర్ కత్రినా కైఫ్ సహా ఎనిమిది మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన ప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా ఇక అతనితో ప్రేమకు ఒప్పుకుంది అన్న టాక్ వినిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: