వేణు స్వామి చెప్పిన జాతకాల పై టాలీవుడ్ లో చర్చలు !
‘పుష్ప’ మూవీతో ఇప్పటికే పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ జాతకంలో అద్భుతమైన యోగ దశ ప్రారంభమైనదని రానున్న 5సంవత్సరాలలో బన్నీ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ వన్ స్థానానికి చేరుకుంటాడు అంటూ వేణు స్వామి బన్నీ జాతకం పై తన అంచనాలు బయటపెట్టాడు. అంతేకాదు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ప్రముఖ హీరోలకు వారి జాతకం రీత్యా కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని దీనితో వారు ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు కొన్ని క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అంటూ వేణు స్వామి చెప్పిన జోశ్యంలో ఆ ఇద్దరు టాప్ హీరోలు ఎవరు అంటూ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నాయి.
అయితే వేణు స్వామి ఆహీరోల పేర్లు చెప్పకపోవడంతో టాప్ హీరోల అభిమానులు వేణు స్వామి జోశ్యం చెప్పిన ఆ టాప్ హీరోలు ఎవరు అంటూ తెగ ఆరాట పడుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం టాప్ హీరోలు ఎవరికీ చెప్పుకోతగ్గ అనారోగ్య సమస్యలు లేవు.
దీనికితోడు టాప్ హీరోలు అంతా తమ ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటూ ఎవరికీ వారు తమ వ్యక్తిగత జిమ్ కోచ్ లను అదేవిధంగా వ్యక్తిగత డైటీషియన్స్ ను ఏర్పాటు చేసుకుని ఎవరికి వారు చాల జాగ్రత్తగా ఉంటున్నారు. అంతేకాదు తమ అభిమానులకు కూడ ఎలా ఆరోగ్యంగా ఉండాలో హెల్త్ టిప్స్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో వేణు స్వామి నోటి వెంట టాప్ హీరోల ప్రస్తావన వచ్చింది అన్నవిషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గా కొనసాగుతోంది..